ఆరు రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎలా సాధ్యం.. టీడీపీ కోర్టుకు వెళితే ఆగిపోతాయా

ఆరు రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎలా సాధ్యం.. టీడీపీ కోర్టుకు వెళితే ఆగిపోతాయా

TDP maybe challenge SEC zptc, mptc new schedule
TDP maybe challenge SEC zptc, mptc new schedule

నామినేషన్ల ప్రక్రియ దగ్గర ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఏకంగా ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవంగా అయితే ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఏడాది కాలం గ్యాప్ రావటం వల్లే చాలా సమస్యలు ఇప్పుడు ఉన్నాయి.

2020 మార్చి నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వంద మందికి పైగా అభ్యర్థులు ఇప్పుడు చనిపోయారు. నామినేసన్ దాఖలు అభ్యర్థులు చనిపోతే మళ్లీ కొత్తగా నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలా కాదని ఎలా షెడ్యూల్ ప్రకటిస్తారనేది సందేహం. మళ్లీ నామినేసన్ల స్వీకరణకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇదే విషయాన్ని ఇప్పటికే టీడీపీ సైతం ప్రశ్నించింది.

ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని ఆరు రోజుల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే.. నామినేషన్ అభ్యర్థులు చనిపోయారు అనేది ప్రధాన పాయింట్ కదా.. ఇదే జరిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కమిషనర్ గా ఉన్నప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్ విషయంలో జోక్యం చేసుకోలేం అని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. అదే విధంగా 3 లక్షల 40 వేల మంది ఓటర్లుగా అవకాశం కోల్పోయారని కేసు వేసినా.. అది కమిషన్ పరిధిలోకి వస్తుందని.. షెడ్యూల్ విడుదల అయిన తర్వాత జోక్యం చేసుకోలేం అని హైకోర్టు వెల్లడించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు నీలంసాహ్ని ఇచ్చే షెడ్యూల్ పైనా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ పై విడుదలయ్యే షెడ్యూల్ ఎలాంటి పొలిటికల్ ఇష్యూకు దారి తీస్తుంది.. టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు