జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయం – చంద్రబాబు సంచలన నిర్ణయం

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయం - చంద్రబాబు సంచలన నిర్ణయం కార్యకర్తల్లో మనో దైర్యం దెబ్బతింటుందని.. పోటీ చేయాలని కొంత నేతలు చంద్రబాబుకు సూచించారంట. ఇప్పుడున్న పరిస్థితులు

TDP not contest zptc, mptc elections, chandrababu take shocking decision
TDP not contest zptc, mptc elections, chandrababu take shocking decision

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న వెంటనే.. జెడ్పీటీసీ, ఎంపీటీసీఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అదే సమయంలో జిల్లాల్లో కరోనా వ్యాప్తి, వైద్య శాఖ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ క్షణమైనా జెడ్పీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని.. పోటీ చేయకూడదని నిర్ణయించింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలోనే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచింది.. ఇప్పుడు నీలం సాహ్ని కమిషనర్ గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, క్యాడర్ ఇప్పుడు మరింత రెచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి సమయంలో పోరాడి ప్రయోజనం లేదని భావించిన అధినేత చంద్రబాబు.. ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాన ప్రతిపక్షం పార్టీ.. రెండేళ్ల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికలను బహిష్కరించటం, పోటీ చేయకూడదని నిర్ణయించటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మరే పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు రాజకీయ నేతలు. గెలిచినా.. ఓడినా.. ఎన్నికలను ఎదుర్కోవటం, కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపటం అనేది కామన్.. అలాంటిది గ్రామస్థాయిలో కీలకం అయిన జెడ్పీ ఎన్నికలను బహిష్కరించటం వల్ల టీడీపీ నేతలు, కార్యకర్తల్లో మనో దైర్యం దెబ్బతింటుందని.. పోటీ చేయాలని కొంత నేతలు చంద్రబాబుకు సూచించారంట. ఇప్పుడున్న పరిస్థితులు ఇది మంచిది కాదని.. జెడ్పీ ఎన్నికలను బహిష్కరించటమే మేలని భావించారంట.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంటే.. వార్ వన్ సైడ్ అవ్వటమే కాదు.. ఒక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ సైతం తెలుగుదేశం పార్టీకి దక్కదు. గ్రామస్థాయిలో క్యాడర్ మరింత జారిపోయే ప్రమాదం ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు