టీడీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఊహించని ట్విస్ట్ తో టీడీపీ శ్రేణులు షాక్

టీడీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఊహించని ట్విస్ట్ తో టీడీపీ శ్రేణులు షాక్

tdp office in mangalagiri
tdp office in mangalagiri

టీడీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఊహించని ట్విస్ట్ తో టీడీపీ శ్రేణులు షాక్

తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాన్ని టీడీపీ శ్రేణులు ఊహించలేదు. దీనికి కారణం ఏంటో తెలుసా.. ఏపీలోని మంగళగిరిలో కట్టిన టీడీపీ ఆఫీసుకి సంబంధించిన కేసు.

టీడీపీ ఆఫీసు అక్రమ నిర్మాణం అని.. భూ కేటాయింపు సైతం నిబంధనలకు విరుద్ధంగా సాగిందని.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని డిస్ మిస్ చేసింది హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఆళ్ల. దీనిపై ఏప్రిల్ 15వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేసింది.

టీడీపీ ఆఫీసు నిర్మాణం, భూ కేటాయింపులకు సంబంధించి ఏపీ హైకోర్టు విచారణ చేయాలని.. పిటీషన్ ను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ.. కేసును మళ్లీ హైకోర్టుకు బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. దీనిపై గడువు విధించింది. నాలుగు వారాల్లో.. అంటే నెల రోజుల్లో విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది.

హైకోర్టులో ఇదే పిటీషన్ ను కొట్టివేసిన తర్వాత.. టీడీపీ శ్రేణులు ఖుషీ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణ చేయాలని ఆదేశించటంతో టీడీపీకి షాక్ అనే చెప్పాలి. సుప్రీంకోర్టులో తీర్పు ఇలా వస్తుందని ఎప్పుడూ ఊహించి ఉండరు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఎందుకంటే.. వాళ్ల ధీమా వాళ్లకు ఉంది కాబట్టి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు