టీడీపీ పోలవరం యాత్రల ఖర్చు రూ. 100 కోట్లు – అయ్యప్పమాల వేసుకుని అబద్ధం చెప్పను

టీడీపీ పోలవరం యాత్రల ఖర్చు రూ. 100 కోట్లు - అయ్యప్పమాల వేసుకుని అబద్ధం చెప్పను.. ఒక్క రూపాయి కూడా పర్యటనల కోసం ఖర్చు చేయలేదు అని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి అనీల్ కుమార్.

ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తి కరమైన విషయం బయటకు వచ్చింది. ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చెప్పిన వివరాలతో జనం షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

టీడీపీ ఇరిగేషన్ మంత్రి కంటే చాలా బెటర్ గా.. అంత కంటే ఎక్కువే నేర్చుకున్నాను అంటూ కౌంటర్ వేశారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. అయ్యప్ప మాల వేసుకుని అబద్ధం చెబితే నాకు చెడు జరుగుతుంది.. నేను నిజమే చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు.

ఏడాదిన్నర కాలంలో.. అధికారం వచ్చిన 18 నెలల కాలంలో సీఎం జగన్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోలవరం సందర్శించి వస్తున్నా.. ఒక్క రూపాయి కూడా పర్యటనల కోసం ఖర్చు చేయలేదు అని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి అనీల్ కుమార్.
ఐదేళ్ల చంద్రబాబు కాలంలో.. పోలవరం పర్యటనలు, సందర్శనల కోసం 100 కోట్ల రూపాయల ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

టీడీపీలా దుబారా ఖర్చులు, హడావిడి చేయటం లేదని.. ఎంతో పొదుపుగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు పోలవరం పర్యటనల కోసం చేసిన 100 కోట్ల రూపాయల దుబారా ఖర్చుతో.. 500 కుటుంబాలను బాగు చేయొచ్చు అన్నారు.
తమ ఆర్భాటం కోసం 100 కోట్ల జనం సొమ్మును ఖర్చు చేశారని.. అది ఎవరి డబ్బో.. ఎవరి సొత్తో ప్రజలే తెలుసుకోవాలన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు