చంద్ర నామస్మరణగా ఏప్రిల్ – స్పెషల్ ఫొటో రిలీజ్ – హ్యాష్ ట్యాగ్ అనౌన్స్

చంద్ర నామస్మరణగా ఏప్రిల్ - స్పెషల్ ఫొటో రిలీజ్ - హ్యాష్ ట్యాగ్ అనౌన్స్

అందరికీ అన్నీ పండుగలు వస్తాయి.. టీడీపీకి మాత్రం రెండు పండుగలు ప్రత్యేకం. ఒకటి ఎన్టీఆర్ జయంతి.. మరొకటి చంద్రబాబునాయుడు బర్త్ డే. ఆ వేడుక రానే వచ్చింది ఇప్పుడు.

ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. 2021 ఏడాదిని స్పెషల్ గా.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది. రాజకీయాలతో సంబంధం లేకుండా చంద్రబాబు విజన్ ను ప్రజలకు చేరువ చేసే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది పసుపు దళం.

ఇప్పటికే ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయ్యింది. #NCBNBdayMonth పేరుతో కామన్ DP (డిస్ ప్లే పిక్చర్ ) విడుదల చేసింది పార్టీ.

చంద్రబాబు ఫొటోతోపాటు వెనక సింహం వాచ్ చేస్తున్నట్లు ఉన్న ఈ డీపీ.. టీడీపీ అభిమానులను అలరిస్తోంది. అదే విధంగా ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్, గూగుల్ లో ట్రెండ్ అయ్యే విధంగా అభిమానులు, కార్యకర్తలు, నేతలు అందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చింది పార్టీ.

చంద్రబాబునాయుడు నామస్మరణ నెలగా ఏప్రిల్ నెలను పార్టీ అభిమానులు అందరూ గుర్తించి.. అందుకు తగ్గట్టుగానే పని చేయాలని పిలుపునిచ్చింది పార్టీ. ఈ మేరకు డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా ప్రత్యేకంగా ఓ పేజీతోపాటు.. క్యాంపెయిన్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.

ఎన్నికల వ్యవహారంతో ఇది కొంచెం నెమ్మదించింది అని చెప్పాలి. జెడ్పీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఊపందుకుంటాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు