150 డివిజన్లలో చందానగర్ హాట్ టాపిక్ – ఇక్కడ టీడీపీ గట్టి పోటీ ఇవ్వటం విశేషం

టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందా అంటే.. ఏమో గెలవొచ్చు కూడానూ.. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది.. అందులోనూ మౌనిక కుటుంబానికి మంచిపేరు ఉంది.. భారీ సంఖ్యలోనే ఓట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ – బీజేపీ – కాంగ్రెస్ మధ్యే పోటీ.. ఆయా డివిజన్లలో వారీగా చూసుకున్నా.. ఈ మూడు పార్టీల నుంచే బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు.. గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఇదే పరిస్థితి ఉంది అని అందరూ అనుకుంటున్నా.. ఒకే ఒక్క డివిజన్ లో టీడీపీ పోటీ ఇవ్వటం అన్ని పార్టీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే చందానగర్ డివిజన్.

ఈ డివిజన్ నుంచి టీడీపీ తరపున జెల్లా మౌనిక పోటీకి దిగారు. అన్ని పార్టీల కంటే ముందుగానే ఖరారైన అభ్యర్థి.. బీ-ఫాంతో సహా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి మౌనిక. మొదట్లో అందరూ లైట్ గానే తీసుకున్నా.. రోజురోజుకు మారుతున్న పరిణామాలతో.. టీడీపీ అభ్యర్థిని విస్మరించలేని స్థితికి వచ్చేశాయి.

జెల్లా మౌనిక చందానగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుస్తారు అని ఖచ్చితంగా టీడీపీ చెబుతున్నా.. .. గెలుపోటములను కచ్చితంగా డిసైడ్ చేయబోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 13 సంవత్సరాలుగా మౌనిక ఫ్యామిలీ ప్రజల్లోనే ఉంది. నిర్మాణ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య, వృత్తి, ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మౌనిక కుటుంబం డివిజన్ లోని అందరికీ సుపరిచితులు.

చందానగర్ డివిజన్ లో 60 శాతం యూత్. ఐటీ ఉద్యోగులు. వీళ్లందరికీ మౌనిక కుటుంబంతో పదేళ్లుగా అనుబంధం ఉంది. ఎలాంటి కార్యక్రమం అయినా ముందుండి నడిపించటమే కాకుండా.. డివిజన్ లోని సమస్యలపై పోరాటంలో ముందుంటారు. చందానగర్ డివిజన్ లో ప్రధాన సమస్యలు మూడు. ఒకటి డివిజన్ మధ్య నుంచి ప్రవహిస్తున్న నాలా. దీని వల్ల దుర్గంధం ఒకటి అయితే చుట్టుపక్కల అపార్ట్ మెంట్లు, ఇళ్ల పునాదులు దెబ్బతింటున్నాయనే వాదన ఉంది. మరో సమస్య పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఆట స్థలాలు లేకపోవటం. మూడో సమస్య స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటం. ఈ మూడు విషయాల్లో నిర్మాణ్ ఫౌండేషన్ 13 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది.

చందానగర్ డివిజన్ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉండటంతోపాటు సమస్యల పరిష్కారంపైనా విజన్ ఉండటం టీడీపీ అభ్యర్థి మౌనికకు కలిసి వచ్చే అంశం అంటున్నారు మిగతా పార్టీల నేతలు. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందా అంటే.. ఏమో గెలవొచ్చు కూడానూ.. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది.. అందులోనూ మౌనిక కుటుంబానికి మంచిపేరు ఉంది.. భారీ సంఖ్యలోనే ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు, సామాజిక అవగాహన ఉన్నవారు కదా.. ఏమైనా జరగొచ్చు అంటున్నారు.

అందరి కంటే ముందుగానే టికెట్ కన్ఫర్మేషన్ చేసుకుని.. నామినేషన్ వేసి.. ప్రచారంలోకి దిగిన చందానగర్ టీడీపీ అభ్యర్థి మౌనిక వ్యవహారం.. 150 డివిజన్లలోనే హాట్ టాపిక్ కావటమే కాదు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు