ఓ టీవీ యాంకర్ రాజధాని అంటే అయిపోతుందా ఏంటీ.. దీనికే టీడీపీ వార్నింగ్ ఇవ్వాలా..

ఓ టీవీ యాంకర్ రాజధాని అంటే అయిపోతుందా ఏంటీ.. దీనికే టీడీపీ వార్నింగ్ ఇవ్వాలా..

ఓ టీవీ యాంకర్ రాజధాని అంటే అయిపోతుందా ఏంటీ.. దీనికే టీడీపీ వార్నింగ్ ఇవ్వాలా..

యాంకర్ ప్రదీప్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఓ షోలో మాట్లాడిన ప్రదీప్.. ఏపీ రాజధాని విశాఖపట్నం అన్నారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది.

ఏపీ రాజధాని ఒక్కటి కాదు మూడు అన్న విషయం ప్రభుత్వమే చెప్పింది. అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని అసెంబ్లీలోనే ప్రకటించింది. పరిపాలన రాజధాని ఎక్కడ అయితే ఉంటుందో దాన్ని రాజధానిగా గుర్తించటం కామన్. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సిద్ధాంతం నడుస్తుంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. దీన్నే యాంకర్ ప్రదీప్ చెప్పారని.. ఇందులో తప్పేముంది ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అయితే యాంకర్ ప్రదీప్ కు వార్నింగ్ ఇస్తున్నారు. అమరావతి మాత్రమే రాజధాని అని.. విశాఖపట్నం కాదని.. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం అని అంటున్నారు. క్షమాపణ చెప్పటానికి డెడ్ లైన్ పెట్టారు. సారీ చెప్పకపోతే హైదరాబాద్ లో ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

అంటే అన్నారంటారు కానీ.. ఓ టీవీ యాంకర్ రాజధాని విశాఖపట్నం అంటే అయిపోతుందా ఏంటీ.. ఆ మాత్రం విశాఖపట్నం రాజధాని అయిపోతుందని టీడీపీ భావిస్తుందా.. కోర్టులో కేసు ఉందని కూడా వాళ్లే అంటున్నారు.. అమరావతి రైతు ఉద్యమానికి ఎవరైనా తల వంచాల్సిందే అని కూడా టీడీపీ వాళ్లే అంటున్నారు.. ఇన్ని అనుకున్నప్పుడు.. ఓ టీవీ యాంకర్ అంటే అయిపోతుందా ఏంటీ.. దానికే ఇంత భయపడాలా అంటున్నారు ఏపీ కామన్ ప్రజలు.

యాంకర్ ప్రదీప్ కు టీడీపీ వార్నింగ్ ఇస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్లు ఏం చేస్తారో మేమూ చూస్తాం అంటున్నారు.

అంటే అన్నారంటారు కానీ.. ఓ టీవీ యాంకర్ ఏపీ రాజధాని అమరావతి అంటే అయిపోతుందా.. విశాఖపట్నం అంటే అయిపోతుందా.. లేకపోతే ఒంగోలు అంటే అయిపోతుందా.. రాజధాని అనే అతిపెద్ద అంశాన్ని ఓ టీవీ యాంకర్ డిసైడ్ చేస్తాడని టీడీపీ ఫీలవుతుందా ఏంటీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు