పోస్టల్ బ్యాలెట్స్ లో ఒక్క ఓటు కూడా దక్కించుకోలేని జాతీయ పార్టీ

పోస్టల్ బ్యాలెట్స్ లో ఒక్క ఓటు కూడా దక్కించుకోలేని జాతీయ పార్టీ.. ఐటీ తెచ్చాను అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు కనీసం ఇంట్లో ఉండి వేసే ఓటు కూడా పడకపోవటం ఏంటీ అని టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

TDP whitewash in ghmc postal balets
TDP whitewash in ghmc postal balets

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగింది. శుక్రవారం కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత బీజేపీ – టీఆర్ఎస్ – కాంగ్రెస్ – ఎంఐఎం పార్టీల మధ్య బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం కొనసాగింది. బీజేపీ అయితే ఏకంగా 88 డివిజన్లలో బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం సాధించి తన సత్తా చాటింది.

అందరికీ ఆశ్చర్యం ఏంటంటే.. పోలైన 1926 బ్యాలెట్ ఓట్లలో ఒక్కటి అంటే ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి పడలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నేను కట్టాను.. సైబరాబాద్ నిర్మించాను.. హైదరాబాద్ అభివృద్ధికి ఐకాన్ నేనే.. ఐటీ తెచ్చాను అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు కనీసం ఇంట్లో ఉండి వేసే ఓటు కూడా పడకపోవటం ఏంటీ అని టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ తీసుకుంటారు. వీళ్లందరూ చదువుకున్నోళ్లు.. హైదరాబాద్ ను ఎన్నో ఏళ్లుగా చూసినోళ్లు. అలాంటిది వారు కూడా టీడీపీకి ఓటు వేయలేదు అంటే హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగు అయినట్లే. కనీసం పార్టీని చూసి ఓటు వేయటం లేదు అంటే.. ఏమైందీ టీడీపీకి.. ఇంత అంతేనా.. తెలంగాణలో పసుపు మాయం అయినట్లేనా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు