మల్లన్న దెబ్బకు దిగివచ్చిన యూట్యూబ్: టీవీ9, టీ-న్యూస్ ,ఎన్టీవీ, 10టీవీలకు ఓపెన్ ఛాలెంజ్

teenamar mallanna

తెలంగాణలో మీడియా కంటే సోషల్ మీడియానే బలంగా ఉందని స్పష్టం అయిపోయింది.. ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే పత్రికలు, న్యూస్ ఛానళ్లను ప్రజలు విశ్వసించటం లేదని మరోసారి నెటిజన్లు నిరూపించారు. మే 7వ తేదీ శుక్రవారం.. తీన్మార్ మల్లన్న Q Newsపై కొన్ని వ్యతిరేక శక్తులు రిపోర్ట్ కొట్టటం.. దానిపై యూట్యూబ్ స్ట్రయిక్ వేయటం.. ఆ తర్వాత మల్లన్న టీం, తెలంగాణ సమాజంలోని నెటిజన్లు స్పందించిన తీరు సంచలనంగా మారింది.

Q News మల్లన్న వీడియోపై టీవీ9, టీ-న్యూస్, ఎన్టీవీ, టీ న్యూస్ ఛానళ్లు తమ కంటెంట్ కాపీ అంటూ స్ట్రయిక్ కొట్టాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా #FakeStrikes, #qnews హ్యాష్ ట్యాగ్ తో పెద్దఎత్తున నెటిజన్లు మద్దతు తెలుపుతూ.. క్యూన్యూస్ స్ట్రయిక్ ను ప్రశ్నించాయి. 10 వేలకు పైగా ట్విట్లు రావటంతో స్ట్రయిక్ పై పునరాలోచించిన యూట్యూబ్.. క్యూన్యూస్ పై ఉన్న స్ట్రయిక్ ను తొలగించింది.

దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించాడు. దీని వెనక మైహోం గ్రూప్ అధినేత , అతని న్యూస్ ఛానల్స్ అయిన టీవీ9, ఎన్టీవీ, టీ-న్యూస్, 10 టీవీ హస్తం ఉన్నాయని ఆరోపించాడు. రామేశ్వరరావు కుట్రలను బయటపెడతానని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చాడు మల్లన్న. యూట్యూబ్ ఛానల్ స్ట్రయిక్ ను 4 గంటల్లోనే ఎత్తివేయటం మా విజయం అని.. తెలంగాణలో ప్రత్యామ్నాయ ఛానల్ ఉండాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని.. నెటిజన్ల మద్దతుతోనే ఇది సాద్యం అయ్యిందన్నాడు మల్లన్న.

తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను మరుగున పరిచే విధంగా.. స్వతంత్రంగా పని చేస్తున్న క్యూన్యూస్ ఛానల్ పై కుట్ర జరుగుతుందని.ఇది సోషల్ మీడియా అని.. మీ టీవీలు, పత్రికలు కాదని.. భవిష్యత్ లోనూ ఇదే విధంగా సోషల్ మీడియా వేదికగా మీ యవ్వారం తేలుస్తానంటూ టీవీ9, టీ-న్యూస్, 10టీవీ, ఎన్టీవీ ఛానళ్లకు వార్నింగ్ ఇచ్చాడు మల్లన్న.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు