ఓయూలో బీజేపీ ఎంపీ తేజస్విని సూర్యను అడ్డుకున్న పోలీసులు

యూనివర్సిటీల్లోకి ఆంక్షలు ఎందుకు అని బీజేపీ యువ ఎంపీ తేజస్విని సూర్య నిలదీశారు. ఇదెక్కడి రాజ్యం అని

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ యువమోర్చా నేత, ఎంపీ తేజస్విని సూర్యను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్లగా.. ఆయనకు చేదుఅనుభవం ఎదురైంది. వర్సిటీలోని ఎన్ సీసీ గేటు దగ్గర పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆపేశారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎన్ సీసీ గేటు ఎదుట ఉన్న ముళ్ల కంచెలు, పోలీస్ బారికేడ్లను తొలగించి లోపలికి వెళ్లటానికి ప్రయత్నించారు.

ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. రాజకీయ నాయకులను లోపలికి అనుమతించం అని పోలీసులు చెప్పారు. వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. వర్సిటీలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వస్తాం అని.. దీనికి అనుమతి ఎందుకు అని నిలదీశారు బీజేపీ స్టూడెంట్ లీడర్స్. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది.

చివరకు కొన్ని షరతుల మధ్య, వాగ్వాదం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్లటానికి అనుమతి ఇచ్చారు పోలీసులు. యూనివర్సిటీల్లోకి ఆంక్షలు ఎందుకు అని బీజేపీ యువ ఎంపీ తేజస్విని సూర్య నిలదీశారు. ఇదెక్కడి రాజ్యం అని ప్రశ్నించారు. విద్యాలయాల్లో ఇలాంటి ఆంక్షలు ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు