సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనక.. బలమైన బీజేపీ శక్తి ఏదో ఉంది

దగ్గరుండి షెడ్యూల్ ఖరారు చేయించారంట.. బీజేపీలో అంత బలమైన శక్తి ఎవరబ్బా అని బీజేపీ సాధారణ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు...

Telangana BJP Internal Power support to TRS Party
Telangana BJP Internal Power support to TRS Party

దుబ్బాక, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించిన బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. విజయోత్సవ మూడ్ లో ఉండగానే సీఎం కేసీఆర్ ఇచ్చిన షాక్ తో ఖంగుతిన్నారు. రెండు నెలల జోష్ పై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లు అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే.. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారు. ఎంచక్కా బీజేపీ అగ్రనేతలు అందరితో గంటల తరబడి సమావేశం అయ్యి.. సుదీర్ఘంగా చర్చించి.. సొంత పార్టీ హైకమాండ్ ను కలిసినట్లు కలిసి వచ్చారు.

సీఎం కేసీఆర్ కుటుంబ పాలన అంతం అవుతుంది.. బీజేపీ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది.. సీఎం కేసీఆర్ పని ఇక అయిపోయింది అన్నోళ్లు అందరూ ఇప్పుడు సప్పుడు చేయకుండా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. జాతీయ పార్టీ నేతలను కలిసి వచ్చినంత ఈజీగా ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి.. కూల్ గా హైదరాబాద్ వచ్చారు కేసీఆర్.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల చూసినోళ్లు అందరూ ఇప్పట్లో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు.. ఇంకా బాగా నొక్కుతారు అనుకున్నారు అంతా.. విక్టరీ మూడ్ లో ఉన్న బీజేపీ నేతలు కోలుకోకుండానే అందరి అపాయింట్ మెంట్లు తీసుకుని చక్కగా షెడ్యూల్ ప్రకారం కలిసి మెలిసి వచ్చారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనక బీజేపీలోని బలమైన రాజకీయ శక్తి బాగా పని చేసిందనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచే రాయబారం నడిపి.. దగ్గరుండి షెడ్యూల్ ఖరారు చేయించారంట.. బీజేపీలో అంత బలమైన శక్తి ఎవరబ్బా అని బీజేపీ సాధారణ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

బీజేపీలోని శక్తి.. టీఆర్ఎస్ పార్టీకి బలం అవుతుందా ఏంటీ అని చర్చించుకుంటున్నారు. ఆ శక్తి ఇప్పుడు కృతజ్ణత చూపిస్తుందా ఏంటీ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు