తిరుపతి ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతల క్యూ – నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటీ?

తిరుపతి ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతల క్యూ - నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటీ? నాగార్జునసాగర్ లో పోలింగ్ జరగటం లేదా.. ఏపీలో బీజేపీ నేతలు లేరా

Telangana bjp leaders campaign in tirupati bypoll
Telangana bjp leaders campaign in tirupati bypoll

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇంటి ఓడిపోతామని డిసైడ్ అయ్యి.. రచ్చలో తమ పెతాపం చూపించటానికి తహతహలాడుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఏపీ, తెలంగాణ ప్రజలు అవాక్కవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తిరుపలి లోక్ సభకు, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీ పోలింగ్.. మే 2వ తేదీ కౌంటింగ్ ఉంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై బీజేపీ నేతలు ముందుగానే చేతులెత్తేసినట్లు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి జోరుగా మీదుంటే.. సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలవాలని నోముల నర్సింహయ్య కుమారుడిని బరిలోకి దింపింది టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీల హోరాహోరీ మధ్య కమలం కకావికలం అయ్యింది. దీనికితోడు నియోజకవర్గం నుంచి ఇద్దరు బీజేపీ బలమైన లీడర్స్ జంప్ కావటంతో.. ఆ సీటుపై ఆశలు వదులుకుంది తెలంగాణ బీజేపీ.

ఎంత ప్రచారం చేసిన ఫలితం శూన్యం అని భావించిన తెలంగాణ బీజేపీ నేతలు.. ఏపిలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందరూ పోలోమని ప్రచారానికి వెళుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఎమ్మెల్యే రాజాసింగ్, ఏప్రిల్ 5వ తేదీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు.

ఏప్రిల్ 14న అయితే ఏకంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి వెళుతున్నారు. ఇలా తెలంగాణ బీజేపీ నేతలు అందరూ తిరుపతిలో ప్రచారం చేస్తుండటంతో.. నాగార్జునసాగర్ లో పోలింగ్ జరగటం లేదా.. ఏపీలో బీజేపీ నేతలు లేరా అనే డౌట్ వస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికపై తెలంగాణ బీజేపీకి ఎందుకింత ప్రేమ అనేది అర్థం కావటం లేదు. సొంత రాష్ట్రంలో ఉప ఎన్నిక వదిలేసి మరీ.. పక్క రాష్ట్రంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటీ అనేది కూడా అంతుచిక్కటం లేదు. గతంలో నోటా కంటే తక్కువ వచ్చాయి కదా.. ఈసారి దాన్ని అధిగమించాలని కష్టపడుతున్నారా లేక తిరుపతిలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారా.. వీరి ఉద్దేశం ఏంటో మే 2వ తేదీ తేలిపోనుంది…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు