హుజూరాబాద్ ఎన్నికపై బీజేపీ ఢిల్లీ వ్యూహం.. మార్గనిర్దేశం చేసిన కీలక నేత

హుజూరాబాద్ ఎన్నికపై బీజేపీ ఢిల్లీ వ్యూహం.. మార్గనిర్దేశం చేసిన కీలక నేత

హుజూరాబాద్ ఎన్నికపై బీజేపీ ఢిల్లీ వ్యూహం.. మార్గనిర్దేశం చేసిన కీలక నేత

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ యాక్షన్ లోకి దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టిన హైకమాండ్.. హుజూరాబాద్ ను లైట్ తీసుకోవద్దని సూచించింది. సర్వశక్తులు ఒడ్డాల్సిన పని లేదని.. స్మార్ట్ వర్క్ చేయాలని దిశా నిర్దేశం చేసింది బీజేపీ నేతలకు.

2021, జూలై 14వ తేదీ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇతర నేతలు. గంటపాటు సాగిన ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రౌండ్ లెవల్ లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయటంతోపాటు.. ఎవరెవరు ఏయే బాధ్యతలు చేపట్టాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించారంట.

బీజేపీ రాష్ట్ర పెద్దలు అందరికీ మార్గనిర్దేశం చేసిన హైకమాండ్ నేతలు.. హూజూరాబాద్ గెలుపు పార్టీకి ఎంత కీలకమో వివరించారంట. దుబ్బాక తర్వాత నాగార్జునసాగర్ లో ఓడిపోయాం.. ఇలాంటివి మళ్లీ జరగకూడదు.. హుజూరాబాద్ గెలిచి సత్తా చూడాలని స్పష్టం చేశారంట.

కేంద్ర నాయకత్వం నుంచి కావాల్సిన మద్దతుపై ప్రణాళిక ఇవ్వాలని ఆ మేరకు ఇంచార్జిని నియమించి.. అన్ని వ్యవహారాలు చక్కబెడతాం అని తెలిపారు హైకమాండ్ పెద్దలు. అవసరాన్ని బట్టి కేంద్ర నాయకత్వం నుంచి కొంత మంది పెద్దలు పర్యటనకు వస్తారని.. అందు కోసం ప్లానింగ్ చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారంట.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు