ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు

ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు

Health Condition Report
Health Condition Report

తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. గురువారం ఉదయం హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తర్వాత.. క్యాంప్ ఆఫీసుకు తిరిగి వచ్చారు. ఈ సమయంలోనే ఆయనకు ఛాతీలో మంట వచ్చింది. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయనున్నారు వైద్యులు. సీఎం కేసీఆర్ అనారోగ్యం వార్తలు బయటకు రావటం, యశోధ ఆస్పత్రికిలో పరీక్షలు విషయం తెలిసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అభిమానుల్లో అలజడి పుట్టింది.

సీఎం కేసీఆర్ కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ఆస్పత్రికి వెళుతున్నారు. రెండు గంటల తర్వాత తిరిగి క్యాంప్ ఆఫీసుకు రానున్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇది రొటీన్ గా జరిగే విషయమే అని.. సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు క్యాంప్ ఆఫీసులో సాధ్యం కాదని.. అందుకే ఆస్పత్రికి వెళుతున్నట్లు చెబుతున్నారు. అంత కంటే ఏమీ విశేషం లేదంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు