సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. ఫాంహౌస్ లో ట్రీట్ మెంట్

cm kcr shocking decision on malls and cinema halls by corona

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వారం క్రితం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత హైదరాబాద్ ప్రగతిభవన్ ను తిరిగి వచ్చారు. ఒంట్లో నలతగా ఉండటంతో.. ఏప్రిల్ 19వ తేదీ సోమవారం ఉదయం కరోనా పరీక్ష చేయించుకున్నారు. అదే విధంగా సిటీ స్కాన్ తీయించుకున్నారు. కరోనా అని నిర్థారించారు డాక్టర్లు.

సీఎం కేసీఆర్ కు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని.. తీవ్రంగా లేవని చెబుతున్నారు డాక్టర్లు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నాయని.. అంతకు మంచి ఏమీ లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఫాంహౌస్ లోనే ఉంచి చికిత్స తీసుకుంటున్నారు కేసీఆర్. అతని ఆరోగ్యాన్ని ప్రత్యేక వైద్య బృందం సమీక్ష చేస్తుంది.

సీఎం కేసీఆర్ కు కరోనా అని తెలిసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ షాక్ అయ్యారు. ఆరోగ్యంగా ఉండాలని.. కరోనాను జయించాలంటూ నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు