పోలీస్ నోటిఫికేషన్ అంటు సోషల్ మీడియాలో వైరల్.. నిజం చెప్పిన డీజీపీ

అసలే నిరుద్యోగులు కసిగా ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారా అని వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా సర్క్యూలేట్ అవుతున్న ఓ పిడిఎఫ్ ఫైల్ నిరుద్యోగుల కంట పడింది.. దింతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాన్ని మరో పదిమందికి షేర్ చేశారు. ఆలా ఓగంటలో ఆ పిడిఎఫ్ రాష్ట్రము మొత్తం తిరిగివచ్చింది. అది చూసిన నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అది ఫేక్ న్యూస్ అని, మార్పింగ్ చేసి ఎవరో సర్క్యూలేట్ చేశారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. దింతో నిరుద్యోగుల ఆనందం డీజీపీ మాటతో ఆవిరై పోయింది.

అయితే ఈ నోటిఫికేషన్ 2018 కి సంబంధించి దీని డేట్ మార్చి 03-04-2021 పెట్టి ఫేక్ నోటిఫికేషన్ తయారు చేశారు. అయితే పోలీస్ శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు కూడా దీన్ని షేర్ చెయ్యడం అస్యాస్పదంగా ఉంది. ఇక ఈ ఘటనను డీజీపీ ఆఫీస్ సీరియస్ తీసుకుంది. సైబర్‌క్రైమ్‌ పోలీసులతో విచారణకు ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్బంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నోటిఫికెషన్స్ విడుదల కావు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండదు.

పోలీస్ నోటిఫికేషన్ అంటు సోషల్ మీడియాలో వైరల్.. నిజం చెప్పిన డీజీపీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు