అసలు నిజం ఇదీ : వరద సాయం ఆగటంలో ఏం జరిగింది – ఎలక్షన్ కమిషన్ ఎందుకు మాటమార్చింది

అసలు నిజం ఇదీ : వరద సాయం ఆగటంలో ఏం జరిగింది – ఎలక్షన్ కమిషన్ ఎందుకు మాటమార్చింది

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నవంబర్ 17వ తేదీ షెడ్యూల్ వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. అంటే నవంబర్ 17వ తేదీ నుంచే అమల్లో ఉంటుందని అయితే.. విపత్తు సాయం కింద నేరుగా నగదు కాకుండా బ్యాంక్ ద్వారా పరిహారం ఇవ్వొచ్చని.. దానికీ దీనికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు కమిషనర్ పార్థసారధి.
ఇదంతా టీవీల్లో, పత్రికల్లో చూసిన వరద బాధితులు నవంబర్ 18వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని మీ సేవ కేంద్రాలకు వేలాదిగా తరలివచ్చారు. సర్వర్లు మొరాయించాయి. తోపులాట, వాగ్వాదాలు జరిగింది. ఓ వృద్ధురాలు క్యూలైన్ లో నిలబడి చనిపోయింది.

అసలే ఎన్నికల నామినేషన్లు ప్రారంభం అయిన క్రమంలో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది మైనస్ అని అందరూ భావించారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల కమిషన్ వరద సాయానికి బ్రేక్ వేసింది అని ప్రకటించింది.నవంబర్ 17వ తేదీన రూల్స్ ప్రకారం ఇవ్వొచ్చు అని చెప్పిన ఎన్నికల సంఘం.. 18వ తేదీన రూల్స్ ప్రకారం ఎలా ఇస్తారని ఎందుకు బ్రేక్ వేసింది.

దీని వెనక ఏం జరిగింది.. ఎందుకు ఇలా జరిగింది.. ఇదే అందరికీ అంతుచిక్కని ప్రశ్న. వరదసాయం ఆగటం వెనక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ ఉంది అని టీఆర్ఎస్ పార్టీ చెప్పింది.. ఆ లేఖపై అడ్రస్ లేదు.. దిక్కూదివానం లేదు.. బండి సంజయ్ చెబితేనే వరద సాయం ఆపేస్తే.. ఎన్నికల సంఘం రూల్స్ ఒక్క రోజులో ఎలా మారాయి.. పొలిటికల్ పార్టీలు చెప్పిన వెంటనే.. రూల్స్ అన్నీ మారిపోతాయా ఎన్నికల సంఘంలో.. అర్థం చేసుకోండి ప్రజలారా.. నిజం ఏంటో.. తెర వెనక ఏం జరిగిందో.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు