మీ వ్యాక్సిన్లు మీరే కొనుక్కోండి : ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు.. పరిగెత్తండీ రో..

కరోనా వ్యాక్సిన్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం వ్యాక్సిన్లు పంపిణీ చేయదని.. రాష్ట్ర కోటా కింద కేంద్రం, కంపెనీల నుంచి వచ్చే వ్యాక్సిన్లను ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే అందిస్తామని స్పష్టం చేసింది తెలంగాణ వైద్య శాఖ. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వం అని వివరించింది.

మరి ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఎవరు ఇస్తారు అంటే.. వాళ్లకు వాళ్లే కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సినేషన్ వేయాలి అనుకుంటే కంపెనీలకు ఇండెంట్ పెట్టుకుని తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ వైద్య శాఖ ఇచ్చిన ఆదేశాలతో కొత్త డౌట్స్ వస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే అందుబాటులో వ్యాక్సిన్లు లేవు.. వాళ్లకు ఇవ్వటానికే కంపెనీల దగ్గర అంత ఉత్పత్తి లేదు.. ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసుకోవాలి అంటే.. వాళ్లకు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇది జనరల్ డౌట్ అయితే.. మరో లాజిక్ కూడా ఉంది.. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో వ్యాక్సిన్ డోసు ధర కోవీషీల్డ్ 600 రూపాయలు ఉంటే.. కోవాగ్జిన్ 1,200 రూపాయలు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే ధర కంటే ఇది మూడింతలు. సో.. ప్రభుత్వ ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా చేసినట్లయితే కంపెనీలకు మంచి లాభం ఉంటుంది కాబట్టి.. ఆ విధంగా కూడా ప్రైవేట్ ఆస్పత్రుల ఇండెంట్ తొందర వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరికొందరు.

ధర ఎక్కువైనా డబ్బున్నోళ్లకు ఇది లెక్కలేదు కాబట్టి.. ఓ వర్గం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కరోనా నుంచి బయటపడొచ్చు.. వైరస్ వ్యాప్తిని ఓ రకంగా కంట్రోల్ చేసినట్లు అవుతుంది. ప్రభుత్వాసుపత్రుల్లో కొరత ఎలాగూ ఉంది.. కనీసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా వీలైనన్ని ఎక్కువ అందుబాటులోకి తీసుకొస్తే పట్టణ ప్రాంతాల్లో సమస్య సగం పరిష్కారం అయినట్లే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు