మేటర్ డైవర్ట్ చేసి గేమ్స్ ఆడుతున్నారు : హైదరాబాద్ లోకి అంబులెన్స్ లను అడ్డుకోవటానికి అసలు కారణం ఇదే

హైదరాబాద్ లోకి అంబులెన్స్ లను అడ్డుకోవటానికి అసలు కారణం ఇదే.. మేటర్ డైవర్ట్ చేసి గేమ్స్ ఆడుతున్నారే..

ఏపీ నుంచి వచ్చే కరోనా రోగులకు, అంబులెన్స్ లను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోనూ అడ్డుకుంటున్నారు పోలీసులు. అంబులెన్స్ అనేది దేశం కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడైనా.. దేశ సరిహద్దుల నుంచి అయినా ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లాల్సింది.. హైదరాబాద్ ట్రాఫిక్ లో రెండు నిమిషాలు అంబులెన్స్ ఆగితే గగ్గోలు పెట్టేవారు.. ఇప్పుడు గంటల తరబడి రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవటం వెనక అసలు కారణం బలంగా ఉంది.. అదేంటో చూద్దాం..

హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు అన్ని ఫుల్ అయ్యాయి. ఎక్కడా బెడ్స్ లేవు. చిన్నా చితక ఆస్పత్రుల్లో సైతం బెడ్స్ లేవు.. ఆక్సిజన్ కొరత ఉంది.. వెంటిలేషన్ బెడ్ కావాలంటే గగనం అయ్యి ఉంది. ఇది ఓ కారణం మాత్రమే. అంతకు మించి.. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వందలాది మంది డాక్టర్లు ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. రెండు నెలలుగా విరామం లేకుండా పేషెంట్లను ట్రీట్ చేయటం ద్వారా.. సుమారు 300 మంది డాక్టర్లు, మరో 200 మంది వైద్య సిబ్భంది కరోనా బారిన పడ్డారు. వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడినా కూడా.. ఆన్ లైన్ లో అందుబాటులో ఉండాలి.. కరనా తగ్గిన వెంటనే ఆస్పత్రికి రావాలి అంటూ ఒత్తిడి పెరుగుతుంది వారిపై. దీనికితోడు ప్రైవేట్ ఆస్పత్రులు.. కాంట్రాక్ట్ వైద్య సిబ్బదిని అధిక ధరకు ఎగరేసుకుని పోతున్నాయి. దీంతో ఈ పరిణామాల క్రమంలో.. రాబోయే 15 రోజులు.. అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ పై ఇలాగే ఒత్తిడి పెరిగితే.. తెలంగాణలో వైద్య వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా బారిన పడటంతోపాటు.. వారి కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు వచ్చినట్లయితే.. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారనుంది. ఈ పరిస్థితులను అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం.. అత్యధికంగా ఏపీ నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్నది. అదే సాధారణ ప్రజలను మాత్రం అడ్డుకోవటం లేదు. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఉండటం వల్లే ఇలా చేస్తున్నారు..

అసలు విషయం ఇది అయితే.. మేటర్ డైవర్ట్ చేస్తున్నాయి కొన్ని న్యూస్ ఛానళ్లు. ఏపీ – తెలంగాణ మధ్య అంబులెన్సులను అడ్డుకుంటున్నారు అని రాద్దాంతం చేస్తున్నాయి. కరోనా పేషెంట్, అంబులెన్స్ లో ఉన్నాడు.. ఎందుకు హైదరాబాద్ వస్తే అడ్డుకుంటున్నారు.. హైదరాబాద్ పరిస్థితి ఏంటీ.. ఆస్పత్రుల్లో సిట్యువేషన్ ఏంటీ.. డాక్టర్లు, నర్సులు, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకోవటం లేదు అనేది మాత్రం చెప్పటం లేదు.. ఎంతకాడికీ ఏపీ – తెలంగాణ మధ్య ఏదో యుద్ధం జరుగుతున్నట్లు.. వివాదం ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు..

ముందు హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటే.. చూపిస్తే తెలుస్తుంది అంటున్నారు కొందరు డాక్టర్లు.. అసలు విషయం వదిలేసి.. మేటర్ భలే డైవర్ట్ చేస్తున్నారే మీ మీడియా వాళ్లు అంటూ ఓ డాక్టర్ అనటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

See also : విదేశీ కంపెనీల వ్యాక్సిన్లు తెచ్చుకుంటాం.. అనుమతి ఇవ్వండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు