రాజకీయాల్లోకి ప్రముఖ జర్నలిస్ట్ సంగప్ప

మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. 25 ఏళ్ల జర్నలిజంలో ఎలాంటి మచ్చ లేకపోవటం అన్నింటికీ మించి ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని..

Telangana Journalist Sangappa Entry to Politics
Telangana Journalist Sangappa Entry to Politics

వీ6 న్యూస్ ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్.. ఈ ఛానల్ పెట్టటానికి కారణం అయిన ప్రముఖ జర్నలిస్ట్ సంగప్ప రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈనాడు రిపోర్టర్ గా జర్నీ ప్రారంభించి.. ఐన్యూస్ పొలిటికల్ బ్యూరోలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూశారు. ప్రస్తుతం వీ6 న్యూస్ లో ఛానల్ లో ఇన్ పుట్ ఎడిటర్ గా.. 25 ఏళ్ల అనుభవం ఉన్న సంగప్ప.. తెలంగాణ ఉద్యమంలో తన చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ అయ్యారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాజకీయ నేతలతో 15 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఉదయం, సాయంత్రం ఛానల్ డిబేట్స్ లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ తనకంటూ ఓ స్టయిల్ ఏర్పరుచుకున్నారు సంగప్ప.

ఇప్పుడు జర్నలిజానికి ఫుల్ స్టాప్ పెట్టి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు సంగప్ప. ఇందుకు రాజకీయ సన్నిహితులు ప్రోత్సాహం ఉండటం కలిసి వచ్చే అంశం. సంగప్పకు ఉన్న ప్లస్ పాయింట్ ఆయన వ్యక్తిత్వం.

అందర్నీ కలుపుకునిపోయే నైజంతోపాటు.. మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. 25 ఏళ్ల జర్నలిజంలో ఎలాంటి మచ్చ లేకపోవటం అన్నింటికీ మించి ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.

రాజకీయాల్లో రాణించాలంటే మొదటగా క్లీన్ చిట్ ఉండటంతోపాటు పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండాలి. ఈ రెండు సంగప్పకు ప్లస్ పాయింట్ తోపాటు.. అన్ని రాజకీయ పార్టీల్లోని నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో ఆలస్యం చేయకూడదు అనుకుంటున్నారు. త్వరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు