లాక్ డౌన్ కు రెడీ అవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. 30 నుంచి విధించే అవకాశం ?

లాక్ డౌన్ కు రెడీ అవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. 30 నుంచి విధించే అవకాశం ?

telangana lockdown
telangana lockdown

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయటం కోసం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మహారాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ దిశలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించే విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది ప్రభుత్వం.

తెలంగాణకు చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం సైతం ఏప్రిల్ 30వ తేదీ నుంచి రెండు వారాలు.. అంటే మే 14వ తేదీ లాక్ డౌన్ విధించటం ద్వారా పరిస్థితులను చక్కబెట్టాలని భావిస్తుంది.

తెలంగాణలో లాక్ డౌన్ అంశంపై ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. లాక్ డౌన్ విధిస్తేనే మంచిదని సూచించింది ఆరోగ్య శాఖ. కనీసం రెండు వారాలు సంపూర్ణ లాక్ డౌన్ తో కరోనా కేసులను కట్టడి చేయొచ్చని.. దాని వల్ల బెడ్స్, మందుల కొరతను అధిగమించొచ్చని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి హోం సెక్రటరీ, డీజీపీ, సిటీ కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్ విధిస్తే అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు ఉన్నతాధికారులు.

ఏప్రిల్ 30వ తేదీ నుంచి రెండు వారాలు లాక్ డౌన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనపై చర్చిస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక లాక్ డౌన్ అనే అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.. ఇంది ఎంత వరకు కరెక్ట్ అనేది మరో 24 గంటల్లో స్పష్టత రానుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు