తెలంగాణలో 12వ తేదీ నుంచి లాక్ డౌన్.. మందు షాపులు తెరిచే ఉంటాయి

తెలంగాణలో 12వ తేదీ నుంచి లాక్ డౌన్.. నాలుగు గంటలు సడలింపు

telangana lockdown
telangana lockdown

దేశంలోని లాక్ డౌన్ లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సైతం.. ఇప్పుడు లాక్ డౌన్ పెట్టింది. మే 12వ తేదీ నుంచి 10 రోజులు లాక్ డౌన్ అమలు చేయాలని మే 11వ తేదీ మధ్యాహ్నం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

> ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. నిత్యావసరాల కోసం అనుమతి ఇస్తారు.

> 10 రోజులు అంటే.. మే 22వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

> వ్యాక్సిన్ కోసం బయటకు వచ్చే వారికి మినహాయింపు, కోవిడ్ టెస్టు కోసం.. చికిత్స కోసం.. ఆస్పత్రులకు వెళ్లే వారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు

> ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచి ఉంచటానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

> మద్యం షాపులు సైతం నాలుగు గంటలు ఓపెన్ చేసి ఉంటాయని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. నిత్యావసరాలతోపాటు లిక్కర్ షాపులు ఉదయం 6 నుంచి 10 గంటలకు ఓపెన్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు