లాక్ డౌన్ నుంచి భారీగా మినహాయింపులు : ఇది మినీ లాక్ డౌన్.. డోంట్ వర్రీ..

lockdown in telangana

తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నుంచి మినహాయింపులు భారీగానే ఉన్నాయి. అత్యవసర సర్వీసులు అన్నింటికీ అనుమతి ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.

 1. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
 2. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ ఫ్యాక్టరీలతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని విభాగాలు యథావిథిగా పని చేస్తాయి.
 3. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని నిర్ణయం.
 4. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
 5. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ఆయా ఆస్పత్రుల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
 6. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు మామూలుగా పనిచేస్తాయి.
 7. జాతీయ రహదారులపై రవాణా యధావిధిగా కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్ బంకులు తెరిచే ఉంటాయి.
 8. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు, ఉపాధిహామీ పనులు కొనసాగుతాయి.
 9. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
 10. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు పని చేస్తాయి.
 11. ముందస్తు అనుమతులతోనే పెళ్లి చేసుకోవాలి.. 40 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియలకు 20 మందికే అనుమతి.
 12. తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
 13. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా రెగ్యులర్ గా కొనసాగుతుంది.
 14. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు పూర్తిగా మూసివేస్తారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు