మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా.. రూ. 100 కోట్ల భూమి అంట.. ఆ ఒక్క టీవీలోనే బ్రేకింగ్

మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా.. రూ. 100 కోట్ల భూమి అంట.. ఆ ఒక్క టీవీలోనే బ్రేకింగ్

Telangana minister Etela land scam
Telangana minister Etela land scam

మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా.. రూ. 100 కోట్ల భూమి అంట.. ఆ ఒక్క టీవీలోనే బ్రేకింగ్

తెలంగాణలో బిగ్ బిగ్ బ్రేకింగ్.. ఆరోగ్యశాఖ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్ 100 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారంటూ మొట్టమొదటగా ఎన్టీవీలో.. ఆరోగ్య మంత్రి ఆక్రమణల దందా అని బ్రేకింగ్ వచ్చింది.

మెదక్ జిల్లా మూశాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన భూములపై కన్నేశారని.. తన ఫౌల్ట్రీఫాం కోసం బలవంతంగా భూములు సేకరించారు అనేది ఆరోపణలు. సర్వే నెంబర్లు 130/5, 130/9, 130/10లోని భూములను దౌర్జన్యంగా 100 ఎకరాలను బలవంతంగా తీసుకున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించారంటూ ఆయా భూముల రైతులు కంప్లయింట్ చేశారు.

1994లో చాకలి లింగయ్య, చాకలి కృష్ణ, చాకలి నాగులకు పైన చెప్పిన సర్వే నెంబర్లలో ఒక్కో కుటుంబానికి ఎకరం 20 కుంటల చొప్పున ప్రభుత్వం భూములను కేటాయించింది. అదే విధంగా ఎరుకుల రాములు, ఎరుకుల ఎల్లయ్యతోపాటు మరికొందరికి చెందిన భూములను మంత్రి ఈటెల రాజేందర్ బలవంతంగా తీసుకుంటున్నారనేది ఆరోపణలు.

మొత్తం 100 కోట్ల రూపాయల విలువైన భూమి అంట ఇది.. అసైన్డ్ భూములను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కబ్జా చేశారని.. మంత్రి ఈటెల భార్య జమున, మంత్రి ఈటెల అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డి  రైతులను బెదిరించి లాక్కున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను మంత్రి ఈటెల రాజేందర్ తన భార్య, కుమారుడిపై పేరుతో రిజిస్ట్రేషన్ చేశారనేది బాధిత రైతుల కంప్లయింట్ అంట..

ఎన్టీవీ మాత్రమే మొదటగా బ్రేకింగ్ వేయటంతోపాటు.. వరస కథనాలతో.. గ్రాఫిక్ ప్లేట్లతో.. లైవ్ లతో విరుచుకుపడటం చూస్తుంటే.. ఇదేదో పెద్ద బిగ్ బ్రేకింగ్ లా కనిపిస్తోంది.

See also : వైఎస్ అన్నప్పుడు కూడా బాధపడలేదు.. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు : ఈటెల కన్నీటి పర్యంతం

See also : మంత్రి ఈటలపై వేటుకు వేసేందుకు రంగం సిద్దం.. పొమ్మనలేక భూ కబ్జా పొగ పెట్టారా : మీడియా ముందస్తు ప్లాన్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు