పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురికి అవకాశం

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురికి అవకాశం

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురికి అవకాశం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ. 2021, జూన్ 26వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఢిల్లీలో ప్రకటన విడుదల చేసింది ఏఐసీసీ.

భారీ సైజులో రేవంత్ రెడ్డి టీంను ప్రకటించింది పార్టీ అధిష్టానం. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియామించింది. వీరిలో జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డి ఉన్నారు.

ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ, ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు.

సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌‌లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు