ఓరి దుర్మార్గుడా.. రూ.5 లక్షల నోట్లు తగలబెట్టిన అవినీతి ఎమ్మార్వో బినామీ

ఓరి దుర్మార్గుడా.. రూ.5 లక్షల నోట్లు తగలబెట్టిన అవినీతి ఎమ్మార్వో బినామీ.. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో

Telangana Officer Binami burns Rs 5 lakh as ACB team knocks door for raid
Telangana Officer Binami burns Rs 5 lakh as ACB team knocks door for raid

ఓరి దుర్మార్గుడా.. రూ.5 లక్షల నోట్లు తగలబెట్టిన అవినీతి ఎమ్మార్వో బినామీ

పది రూపాయల దొరక్క చచ్చిపోతున్నారు.. బతకటానికి డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇలాంటి టైంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల అవినీతి హద్దులు దాటుతోంది. నోటికి ఎంతొస్తే అంత డిమాండ్ చేసి.. వ్యాపారులు, ప్రజలను అవినీతితో పీల్చుకుంటున్నారు అవినీతి అధికారులు.

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 2021, ఏప్రిల్ 6వ తేదీన జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ఎమ్మార్వో సైదులు గౌడ్ కోసం 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. వెంకటయ్య గౌడ్‌ అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. క్రషర్ అనుమతి కోసం రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశాడు ఎమ్మార్వో సైదులు. రూ.5 లక్షలకు బేరం కుదిరింది.

లంచాన్ని వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా బాధితుడిని ఆదేశించాడు వెల్దండ ఎమ్మార్వో సైదులు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన బాధితుడి నుంచి 5 లక్షల రూపాయల లంచాన్ని వెంకటయ్య గౌడ్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులను చూసిన వెంకటయ్య గౌడ్.. అత్యంత తెలివిగా.. ఏసీబీకి దొరకకూడదనే ఉద్దేశంతో.. 5 లక్షల రూపాయల నోట్లకు నిప్పు పెట్టాడు. అన్నీ 500 రూపాయల నోట్లు. వెంకటయ్య గౌడ్ డబ్బులను తగలబెడుతుండటం చూసిన ఏసీబీ అధికారులు వాటిని ఆర్పివేశారు. అప్పటికే చాలా డబ్బు తగలబడిపోయింది.

ఎమ్మార్వో సైదులకు చెందిన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఇంటితో పాటు.. కల్వకుర్తి, జిల్లెలగూడ, వెల్దండ మండలం చెదురుపల్లిలోని వెంకటయ్య గౌడ్ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. గతంలో ఓ పార్టీకి వెంకటయ్యగౌడ్ మండల అధ్యక్షుడిగా పనిచేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు