కరోనా వచ్చిందని భయపడొద్దు.. తల్లులు, పిల్లలకు సునీతా లక్ష్మారెడ్డి భరోసా

కరోనా వచ్చిందని భయపడొద్దు.. తల్లులు, పిల్లలకు సునీతా లక్ష్మారెడ్డి భరోసా

కరోనా వచ్చిందన్న భయపడొద్దు.. తల్లులు, పిల్లలకు సునీతా లక్ష్మారెడ్డి భరోసా

కరోనాతో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆందోళన, మానసిక వేదన మాటల్లో చెప్పలేనిది. ఇంట్లో తల్లిదండ్రులకు కరోనా వస్తే.. పిల్లల ఆలనా పాలనా చూసే వారు ఉండటం లేదు. అలాంటి వారి కోసం స్ట్రీ, శిశు సంక్షేమ శాఖ సారధ్యంలో.. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.

తల్లిదండ్రులు కరోనా బారిన పడినట్లయితే.. పిల్లల సంరక్షణ, ఆలనా పాలనా కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. మహిళల కోసం 181, పిల్లల కోసం అయితే 1098 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారామె. మహిళలకు చికిత్స లేక అత్యవసర సాయం కావాలంటే 181 నెంబర్ ను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.

కోవిడ్ సమయంలో గర్భిణిలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. తన ఆరోగ్యంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని గుర్తించి.. గర్భిణిలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు వివరించారు సునీతా లక్ష్మారెడ్డి. కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న పేద మహిళలు తమ ఇబ్బందులు, సమస్యలను 181 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పినట్లయితే.. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రకటించారు.

ఓ మహిళగా.. కరోనా బారిన పడే మహిళలు, తల్లుల బాధ ఎలాంటిదో అర్థం చేసుకోగలనని.. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా.. మహిళలను ఆదుకోవటానికి మహిళా కమిషన్ పరిధిలో అన్ని రకాల సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు