టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ విలీనం – ఓటుకు నోటు కేసులో వాంగ్మూలం తర్వాతే ఇలా జరిగింది

టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ విలీనం - ఓటుకు నోటు కేసులో వాంగ్మూలం తర్వాతే ఇలా జరిగింది

telangana tdp merged into trs party
telangana tdp merged into trs party

టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ విలీనం – ఓటుకు నోటు కేసులో వాంగ్మూలం తర్వాతే ఇలా జరిగింది

దెబ్బ మీద దెబ్బతో అల్లాడుతున్న టీడీపీకి.. తెలంగాణలో మరో బిగ్ షాక్ తగిలింది. ఊహించని పరిణామం ఎదురైంది. టీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి లేఖ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒకరు అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి.. టీడీపీని.. టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇవ్వటం సంచలనంగా మారింది.

ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలతో ఉనికి చాటుకుంటున్న టీడీపీ.. ఇప్పుడు మొత్తంగా మాయం అవుతుంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోనుంది టీడీపీ. ఇప్పటికే ఏపీలో వరస ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన టీడీపీకి.. తెలంగాణలోని పరిణామం మరింత షాక్ కు గురి చేస్తోంది. దీనిపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందంటూ స్టీఫెన్ సన్ సీబీఐ కోర్టులో హాజరయ్యి స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన క్రమంలో.. ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు చేర్చుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. టీడీపీని విలీనం చేస్తూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్ కు లేఖ ఇవ్వటం సంచలనంగా మారింది.

ఓటుకు నోటు కేసులో.. స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే ఇలా జరగటం అంటే.. తెర వెనక ఏం జరిగిందనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు