టీఆర్ఎస్ పై చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్.. తన ఆత్మ రమణ పార్టీ మారటం ఏంటీ..

టీఆర్ఎస్ పై చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్.. తన ఆత్మ రమణ పార్టీ మారటం ఏంటీ..

టీఆర్ఎస్ పై చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్.. తన ఆత్మ రమణ పార్టీ మారటం ఏంటీ..

ఎల్.రమణ అనగానే చంద్రబాబు నమ్మినబంటు అంటారు.. కరుడుగట్టిన పసుపు కార్యకర్త. బీసీ నేతగా.. బీసీ పార్టీ అంటే టీడీపీ అన్నట్లు ఉంటాడు.. అలాంటి రమణ పార్టీ వీడుతున్నాడు అంటే.. టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నాడు అంటే చాలా మందికి చాలా డౌట్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులకు ఎక్కడో ఏదో తంతుంది.. చంద్రబాబు మరో కోవర్ట్ ఆపరేషన్ మొదలుపెట్టారా.. ఎల్.రమణను టీఆర్ఎస్ పార్టీలోకి పంపించి.. ప్రత్యర్థి పార్టీ విషయాలను తెలుసుకోవాలని ప్లాన్ చేశారా అనే డౌట్ వస్తుంది.

చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్ అనటానికి అనుమానం ఇదే. ఏపీలో టీడీపీ ఓడిపోయిన వెంటనే.. తన ఆత్మ మిత్రులు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్ లను బీజేపీలోకి పంపించి.. రాజ్యసభలో టీడీపీ దుకాణం బంద్ చేయించారు. అప్పటి వరకు తిట్టిన బీజేపీతో చెలిమి కోసం.. ఢిల్లీలో.. బీజేపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం.. ఏపీలోని ముగ్గురు ఎంపీలను బీజేపీలోకి పంపించారని ఓపెన్ సీక్రెట్. సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్ పార్టీ మారటం.. రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాయటం.. బీజేపీలో విలీనం కావటం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణలో టీడీపీ ఓడిపోయిన వెంటనే.. అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోవర్ట్ ఆపరేషన్ చేసి.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రాత్రికి రాత్రి టీడీపీ సర్దుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న చంద్రబాబు.. మళ్లీ తెలంగాణపై ఫోకస్ చేయటానికి.. టీఆర్ఎస్ పార్టీలోకి తన ఆత్మ అయిన రమణను స్వయంగా పంపిస్తున్నాడనే టాక్ టీడీపీలోనే వినిపిస్తుంది.

రమణకు టీఆర్ఎస్ పార్టీ ఆఫర్ ఇవ్వటం ఇది మొదటిది కాదు.. చాలా సందర్భాల్లో ఆఫర్ వచ్చింది. అయినా పార్టీని వీడలేదు. చంద్రబాబు నా దైవం.. నా కులం.. నా మతం.. నా ప్రాణం అనే రమణ.. హఠాత్తుగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావటం చూస్తుంటే.. ఏదో తేడాగా ఉందే అంటున్నారు టీడీపీ నేతలే.. తెలంగాణపై చంద్రబాబు మరో కోవర్ట్ ఆపరేషన్ మొదలుపెట్టారా ఏంటీ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు