మంత్రి హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సునీతా లక్ష్మారెడ్డి

మంత్రి హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సునీతా లక్ష్మారెడ్డి

telangana women's commission chairperson sunitha lakshma reddy

మంత్రి హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె.. ఇలాంటి పుట్టిన రోజు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వెంట.. ఆమె కుమారుడు కూడా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సునీతా లక్ష్మారెడ్డి తనకు సోదరితో సమానం అన్నారు. ఆమె కుమారుడిని దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే మంచి మనిషి అని.. ఏ సమస్య వచ్చినా.. పరిష్కరించే వరకు నిద్ర పోరన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు