నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ మర్రిపేడ మండల్ ధర్మవరం గ్రామం సీతారాంపూర్ తండాలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు రాష్ట్రం మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. ఉషా అనే బాలికను అత్యాచారం చేసి.. ఆ తర్వాత కిరాతంగా హత్య చేయటాన్ని ఖండించారు. ఇలాంటి ఘటనలు సమాజంలో జరగటం సిగ్గు చేటన్నారు సునీతా లక్ష్మారెడ్డి.

బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య చేయటంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడారామె. బాధిత బాలిక కుటుంబానికి దైర్యం చెప్పి.. ఆదుకోవాలని ఆదేశించారు. నిందితులకు వెంటనే అరెస్ట్ చేసి.. బలమైన సెక్షన్లు నమోదు చేసి.. కఠిన శిక్ష పడే విధంగా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు సునీతా లక్ష్మారెడ్డి.

ఇలాంటి క్లిష్టమైన సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్.. బాలిక ఉషా కుటుంబానికి కమిషన్ సైతం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సునీతా లక్ష్మారెడ్డి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు