ప్రముఖ టీవీ నటి చిత్ర హోటల్ లో ఆత్మహత్య

ప్రముఖ టీవీ నటి చిత్ర హోటల్ లో ఆత్మహత్య.. వీళ్లిద్దరూ ప్లెజంట్ ప్యాలెస్ లో దిగారు. రాత్రి కాబోయే భర్త బయటకు వెళ్లిన సమయంలో చనిపోయినట్లు పోలీసులకు చెబుతున్నాడు. నాలుగు నెలల క్రితమే చెన్నైకి

Television personality VJChitra killed herself by suicide
Television personality VJChitra killed herself by suicide

తమిళనాడుకు చెందిన ప్రముఖ టీవీ, సీరియల్, సినిమా నటి చిత్ర ఆత్మహత్య కలకలం రేపుతోంది. చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు కాబోయే భర్త చెబుతున్నాడు. మంగళవారం వీళ్లిద్దరూ ప్లెజంట్ ప్యాలెస్ లో దిగారు. రాత్రి కాబోయే భర్త బయటకు వెళ్లిన సమయంలో చనిపోయినట్లు పోలీసులకు చెబుతున్నాడు.

నాలుగు నెలల క్రితమే చెన్నైకి చెందిన వ్యాపారవేత్త హేమంత్ తో నిశ్చితార్థం అయ్యింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సమయంలో ఆత్మహత్య చేసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. చిత్ర శరీరంపై గాయాలు ఉండటంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.

హోటల్ లో దిగిన తర్వాత వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఆమెను చంపిన తర్వాత కాబోయే భర్త హేమంత్ బయటకు వెళ్లాడా అనేది నిర్థారణ కావాల్సి ఉంది. చిత్ర కాబోయే భర్త పోలీసులు అదుపులో ఉన్నాడు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు చెబుతున్నా.. అది చాలా ఎత్తులో ఉండటం.. సొంతంగా ఉరి వేసుకోవటం కష్టం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బయటకు వెళ్లి వచ్చిన హేమంత్.. ఎంతకీ తలుపులు తీయకపోవటంతో హోటల్ సిబ్బందిని పిలిచి డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేశారు. హేమంత్ బయటకు వెళుతూ డోర్ ను లోపలి నుంచి లాక్ ఆన్ చేసి వెళ్లి ఉండొచ్చు కదా అంటున్నారు పోలీసులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు