మీకు దండం పెడతా.. ఇంత కంటే చంద్రబాబును దిగజార్చొద్దు.. పసుపుదళం అభిమాని ఆత్మఘోష

మీకు దండం పెడతా.. ఇంత కంటే చంద్రబాబును దిగజార్చొద్దు.. పసుపుదళం అభిమాని ఆత్మఘోష

చంద్రబాబునాయుడు.. ఎవరు అవునన్నా.. కాదన్నా పక్కా రాజకీయ నేత.. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడే కాదు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినోరు.. అలాంటి చంద్రబాబును వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా టీడీపీ పార్టీ వాళ్లే.. ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్లే దిగజార్చుతున్నారు.. టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అధికంగా ఉండే పొలిటికల్ వింగ్ లో ఓ వార్త చూసి టీడీపీ అభిమానులే ఛీ.. ఇంత కంటే దిగజారరు అనుకున్న ప్రతిసారీ.. మన పరువు తీస్తున్నారు.. చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అనే మాటలు మాట్లాడుకోవటం విడ్డూరం. ఇంతకీ స్టోరీ ఏంటీ అంటారా..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం.. చంద్రబాబు తీన్మార్ మల్లన్నతో భేటీ అయ్యారు అనే హెడ్డింగ్. తీన్మార్ మల్లన్నతో చంద్రబాబు భేటీ అవ్వటం ఏంటిరా.. మీరూ మీ చాదస్తం కాకపోతే.. ఆయన చంద్రబాబు.. జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. 40 ఏళ్ల ఇండస్ట్రీ.. హెడ్డింగ్ రాసేటప్పుడు అయినా ముందూ వెనకా చూసుకోరా బాబూ.. మీకు నాలెడ్జ్ కు.. మీ బుర్రలకు ఓ దండం రా బాబూ..

ఇక స్టోరీ అంటారా.. ఇటీవల నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్.. అలియాస్ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో 25 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. కాకపోతే గట్టిపోటీ ఇచ్చారు. కోదండరాంను మూడో స్థానానికి నెట్టి.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలోకి వచ్చి.. పల్లాకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న టీడీపీలోకి తీసుకురావాలని.. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. తీన్మార్ మల్లన్నతో భేటీ అయ్యాడంట. తీన్మార్ మల్లన్నను టీడీపీలోకి తీసుకొస్తే పార్టీ క్యాడర్ లో జోష్ వస్తుందని.. పూర్వ వైభవం వస్తుందంటూ రాసుకొచ్చారు.

వాళ్లు ఎవరో రాశారు అనుకుందాం.. కనీసం ఏ బుర్రతో ఆలోచించి టీడీపీ పొలిటికల్ వింగ్ గ్రూప్ లో దీన్ని పోస్ట్ చేశారో అర్థం కావటం లేదు. హెడ్డింగ్ చూడగానే.. చంద్రబాబు కంటే తీన్మార్ మల్లన్న తోపు అన్నట్లు ఉంది.. వార్త చదివితే చింతపండు నవీన్ కంటే.. చంద్రబాబు దేనికి పనికిరాడు అన్నట్లు ఉంది.. అలాంటి వార్తను కరుడుగట్టిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఉంటే మెయిన్ సోషల్ మీడియా అయినా తెలుగుదేశం పొలిటికల్ వింగ్ లో పోస్ట్ చేశారు అంటే.. చంద్రబాబు ఏం చేద్దామని అనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి..

ఇంత కంటే దిగజారరు అనుకున్న ప్రతిసారీ ఇలాంటి వార్తలతో మళ్లీ మళ్లీ నిరూపించుకుంటూ ఉంటే.. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోండి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు