ఎల్.రమణ అంశంపై స్పందించిన అచ్చెన్నాయుడు.. లోకేష్ తో వేగలేకపోతున్నారా..

ఎల్.రమణ అంశంపై స్పందించిన అచ్చెన్నాయుడు.. లోకేష్ తో వేగలేకపోతున్నారా..

ఎల్.రమణ అంశంపై స్పందించిన అచ్చెన్నాయుడు.. లోకేష్ తో వేగలేకపోతున్నారా..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నారని.. ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చిందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయంపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా.. కొంచెం కష్టంగా.. కొంచెం అసహనంగానే స్పందించారు.

ఎల్.రమణ పార్టీ మారుతున్నారు.. పక్క రాష్ట్రం అధ్యక్షుడు రాజీనామాపై మీరేమంటారు అని విలేకరి ప్రశ్నించగా.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమీ లేదు.. ముందే తెలుసు.. అనుకున్నట్లే జరిగింది. చంద్రబాబుతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు అంటూ స్పందించారు అచ్చెన్నాయుడు.

తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న కామెంట్స్ ఇప్పుడు నిజం అవుతున్నాయా అనేది అందరిలో రేకెత్తుతున్న ప్రశ్నలు. పార్టీని ఒక్కొక్కరూ వీడుతున్నారు. పార్టీని వదిలి పెట్టే వారు అందరూ కరుడుగట్టిన టీడీపీ వాదులు.. ఇన్నాళ్లు అధికారం లేకపోయినా.. చంద్రబాబుకు నమ్మిన బంట్లుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లు అందరూ వెళ్లిపోతుండటంతో తెలంగాణ టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయినట్లే అంటున్నారు.

ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు వీళ్లంతా వెళ్లిపోతున్నారు అనేది అందరిలో చర్చనీయాంశం అయ్యింది. పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు కంటే లోకేష్ హవానే పెరిగింది.. లోకేష్ డెసిషన్స్ కే విలువ ఎక్కువ అయ్యింది.. ఈ క్రమంలోనే మోస్ట్ సీనియర్స్ అయిన లీడర్స్ అందరూ లోకేష్ తో వేగలేకపోతున్నారు. పార్టీ విధానాలు, డెసిషన్స్, పార్టీ ఉద్యమాలపై లోకేష్ మాటే ఫైనల్ గా ఉంది.. 40 ఏళ్లుగా పార్టీలోనే ఉన్న సీనియర్స్ ఒక్కొక్కరినీ పక్కనపెడుతూ వస్తున్నారు లోకేష్. దీంతో సీనియర్స్ అందరూ విలువ లేనిచోట ఎందుకు అన్నట్లు.. పక్క పార్టీవైపు చూస్తున్నారు.

పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు సైతం త్వరలో తన దారి తాను చూసుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. రమణ లాంటి వారే పార్టీని వీడినప్పుడు అచ్చెన్నాయుడు ఓ లెక్కా ఏంటీ చెప్పండి.. రెండేళ్లుగా అచ్చెన్నాయుడు బీజేపీ వైపు అనే ప్రచారం జరుగుతూనే ఉంది కదా..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు