ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.. ఇక ఫీజుల వాపస్ ఉద్యమం చేయనున్న లోకేష్.. యూత్ పై గురిపెట్టేశాడు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.. ఇక ఫీజుల వాపస్ ఉద్యమం చేయనున్న లోకేష్.. యూత్ పై గురిపెట్టేశాడు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.. ఇక ఫీజుల వాపస్ ఉద్యమం చేయనున్న లోకేష్.. యూత్ పై గురిపెట్టేశాడు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జూలై 31వ తేదీలోగా అన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది కోర్టు. ఇంత టైట్ షెడ్యూల్ లో ఎగ్జామ్స్ నిర్వహించటం సాధ్యం కాదు కాబట్టి.. ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై టీడీపీ యువనేత లోకేష్ ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వానికి లేఖలు రాశారు. పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యం అన్నారు. రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారు. ఇది టీడీపీ విజయంగా అభివర్ణిస్తున్నారు.

ఎగ్జామ్ ఫీజు 2, 3 వేల రూపాయలు కడితే పాస్ అయ్యేదానికి.. ప్రైవేట్ కాలేజీలు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేశారని.. ఈ ఫీజులను కూడా వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పేరంట్స్. ఈ మేరకు పెద్ద ఎత్తున లోకేష్ కు ఉత్తరాలు రాయాలని నిర్ణయించారు.

పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడిన లోకేష్.. నారాయణ, చైతన్యతోపాటు ఇతర కాలేజీలు వసూలు చేసిన లక్షల రూపాయల ఫీజులను కూడా వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీలకే వెళ్లలేదని.. ఎగ్జామ్స్ లేవని.. ప్రాక్టికల్స్ లేవని.. అలాంటప్పుడు వాటికి కూడా ఫీజులు వసూలు చేశారని.. వాటిని తిరిగి ఇప్పించాలని.. ఈ మేరకు ప్రభుత్వానికి, ప్రైవేట్ కాలేజీలకు ఉత్తరాలు రాయాలని వినమ్రంగా వేడుకుంటున్నారు పేరంట్స్.

పరీక్షల రద్దు విజయంతో ఊపుమీదున్న లోకేష్.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని, కరోనా సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దీనిపైనా ఉత్తరాలతోపాటు ఉద్యమం చేయాలనే ఆలోచన సైతం చేస్తున్నారని చెబుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల సెంట్రిక్ గా చేసే ఉద్యమాల వల్ల తెలుగుదేశం పార్టీకి యూత్ సపోర్ట్ పెరుగుతుందని భావిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు