తెలంగాణలో టెన్త్ పరీక్ష రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా.. ఏపీలో యధాయథం

తెలంగాణలో టెన్త్ పరీక్ష రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా.. ఏపీలో యధాయథం

tenth and inter exams postpone in telangana
tenth and inter exams postpone in telangana

తెలంగాణలో టెన్త్ పరీక్ష రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా.. ఏపీలో యధాయథం

తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న క్రమంలో.. ఇప్పుడు పరీక్షలు నిర్వహించలేం అని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, పేరంట్స్ నుంచి వచ్చిన విజ్ణప్తుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పదో తరగతి ఫీజు కట్టిన వారు అందరూ పాస్ అయినట్లు ప్రకటించనుంది. షెడ్యూల్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా కేసులు ఎక్కువగా వస్తుండటంతో.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా.. పదో తరగతి పరీక్షను రద్దు చేస్తూ.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇంటర్ పరీక్షలు మళ్లీ ఎప్పుడు పెట్టేది తర్వాత ప్రకటించనున్నారు అధికారులు.

ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు వాయిదా చేసిన విషయం తెలిసిందే. కరోనా మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశాల్లేవని, వచ్చే ఆరు వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ చేస్తున్న సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ఇక ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగుతాయని.. ఇప్పటి వరకు వాయిదా వేయాలనే ఉద్దేశం లేదని వెల్లడించింది అక్కడి విద్యా శాఖ. పరీక్ష కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు