ఘోరం.. తప్పు చేశాడని కాళ్ళు విరగొట్టారు

ఘోరం.. తప్పు చేశాడని కాళ్ళు విరగొట్టారు

నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని కడెం మండలం కింగాపూర్ గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు లక్కవత్తుల రాజు అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి రోడ్డుపై పడేశారు. అంతటితో ఆగకుండా కర్రలతో కొట్టారు.

సర్పంచ్ కొడుకు నిందితున్ని కర్రతో చితకబాదాడు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన నిందితుడి తల్లి తన కుమారుడికి మతిస్థితితం లేదని మొత్తుకుంది. అయినా వినకుండా దాడి చేశారు. ఈ దాడిలో రాజు కాలుకి తీవ్ర గాయం అయింది .

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు