భర్త బట్టతలపై చీటింగ్ కేసు పెట్టిన భార్య

భర్త బట్టతలపై చీటింగ్ కేసు పెట్టిన భార్య

అసలే వయసైపోతుంది.. మరో వైపు జుట్టు ఊడిపోతుంది. ఈ సమయంలో ఎం చేస్తారు. పెళ్లికావాలి అంటే జుట్టు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తికి విగ్గు ఆలోచన తట్టింది. విగ్గు పెట్టుకొని టీక్ టాక్ గా రెడీ అయి పెళ్లిచూపులకు వెళ్ళాడు. పెళ్లి కుదుర్చుకున్నాడు. తీరా పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత పెళ్లికొడుకుడి బట్టతల అనే విషయం పెళ్ళికూతురికి తెలిసింది.

అయిన ఎలాగోలా తాళి కట్టించుకుంది. తన భర్తది బట్టతల అని మానసికంగా కుంగిపోయింది. ఇక భరించలేక అత్త, ఆమెతోపాటు కట్టుకున్న భర్తపై కేసు పెట్టింది. ఈ విచిత్ర ఘటన ముంబైలో జరగ్గా, మహిళ ఫిర్యాదుపై నయానగర్ పోలీసులు కేసు నమోదు చేశాడు.. ఇక ఫిర్యాదులో మహిళ మరి కొన్ని విషయాలను జత చేసింది. తనతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఆరోపించింది.

బట్టతల పెట్టుకొని దానిని కప్పిపుచ్చేందుకు విగ్గు పెట్టాడని తెలిపింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అత్త మామలకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ భర్త చీటింగ్ కేసు నమోదు చేశారు. నేడో, రేపో అరెస్ట్ చెయ్యనున్నారు. కాగా నగరంలోని మీరా రోడ్డుకు చెందిన 29 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్‌ ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల యువతికి పెళ్లి జరిగింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు