తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు – 30న పోలింగ్.. మే 3న కౌంటింగ్.. కోర్టుకెళితే బ్రేక్ పడుతుందా..

తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు - 30న పోలింగ్.. మే 2న కౌంటింగ్.. కోర్టుకెళితే బ్రేక్ పడుతుందా..

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్.. మే 3న కౌంటింగ్ ఉండనుంది. ఏప్రిల్ 15వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించటానికి సిద్ధం అయ్యింది ఎన్నికల సంఘం. ఏప్రిల్ 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది.

రెండు కార్పొరేషన్లు అయిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఐదు మున్సిపాలిటీలు అయిన జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందన్న క్రమంలో.. కొత్త వాదన తెరపైకి వస్తుంది. షెడ్యూల్ ప్రకటించే సమయానికి నాలుగు వారాల గడువు ఉండాలనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నట్లు.. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కోర్టుకు వెళ్లాయి. దీనిపై చర్చ జరిగింది. అలాంటిది తెలంగాణలో 15 రోజుల్లో కొత్త నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారనే వాదన ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.

ఇదే అంశంపై ఏపీ హైకోర్టు ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేం అని వెల్లడించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ లో జోక్యం చేసుకోకపోవచ్చు కానీ.. నోటిఫికేషన్ తర్వాత పోలింగ్ కు నాలుగు వారాల గడువు ఉండాలనే నిబంధన మాత్రం ఉంది కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది.

ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఎస్సీ జనరల్ కింద 15, 17, 18, 37, 47, 53 డివిజన్లు కేటాయించగా.. ఎస్సీ మహిళకు 1, 3, 14, 43, 46 డివిజన్లు కేటాయించారు. ఎస్టీ జనరల్ గా 2వ డివిజన్ డిసైడ్ అయ్యింది. 65వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. వరంగల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు