సరదా దొంగ గురు!.. బండి నడపాలి అంటే దొంగతనం చేస్తాడు.

నేటి యువతకు బైక్ దొరికిందంటే చాలు రయ్, రయ్ మంటు చెక్కర్లు కొడుతుంటారు. ఇక తన స్నేహితులు ఎవరైనా బైక్ నడిపితే తనకు ఒక రౌండ్ ఇస్తే బాగుండు అని మనసులో అనుకుంటారు. ఇవ్వకపోతే బాధపడతారు. ఇక ఇవన్నీ మనకెందుకులే బైక్ నడపాలంటే మిత్రుడు ఇవ్వాళా ఏంటి చేతివాటం చూపిస్తే ఎంచక్కా బండి నడిపేయొచ్చు అనుకున్నాడో యువకుడు. బైక్ నడపాలనే సరదా చోరీలు చేసేలా తయారు చేసింది. బైక్ నడపాలి అనే అతని ఆశ ఏకంగా మూడు బైకులను దొంగతనం చేసేలా ప్రేరేపించింది.

వివరాల్లోకి వెళితే మూడు బైక్‌లను దొంగిలించిన ఇత్తడి అరుణ్ అనే యువకుడు శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కాడు. వాహనాలను స్వాదీనం చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆ యువకుడిని రిమాండ్‌కు తరలించారు. డీఐ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైటెక్‌ సిటీ ప్రాంతంలోని చందానాయక్‌ తండాలో నివాసముండే ఇత్తడి అరుణ్‌(19) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆఫీస్‌బాయ్ గా పనిచేస్తున్నాడు‌. అరుణ్ తల్లిదండ్రులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అరుణ్ కు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం..

దింతో దొంగతనాలకు అలవాటు పడి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక బైక్, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో బైక్‌ను దొంగిలించాడు. ఈ రెండు బైక్‌లు నచ్చకపోవటంతో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మరో బైక్‌ను దొంగిలించాడు. తమ బైక్ లు పోవడంతో బాధితులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిదిలో ఫిర్యాదు చేశారు.

దొంగను ఎలా పట్టుకున్నారు?

శుక్రవారం ఉదయం జేఎన్టీయూ చౌరస్తా వద్ద కేపీహెచ్‌బీ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని ఓ బైక్ ను పోలీసులు ఆపారు. లైసెన్స్, బండి కాగితాలు లేకపోవడంతో బైక్ నడుపుతున్న అరుణ్ ను అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో కంగారు పడుతు, అక్కడినుంచి జారుకునేందుకు ప్రయత్నించాడు. దింతో అనుమానం వచ్చిన పోలీసులు, స్టేషన్ లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాదానాలు చెప్పాడు అరుణ్. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. తనకు బైక్ నడపడం అంటే ఇష్టమని కొనుక్కునే స్తొమత లేక ఇలా దొంగతనం చేస్తున్నానని తెలిపాడు. కాగా అరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

సరదా దొంగ గురు!.. బండి నడపాలి అంటే దొంగతనం చేస్తాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు