రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు అప్పుడు-ఇప్పుడు

రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు అప్పుడు-ఇప్పుడు

రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు - అప్పుడు - ఇప్పుడు

రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు అప్పుడు-ఇప్పుడు

మాజీ సీఎం రోశయ్య కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 30 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీకి వాయిస్ అయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా గెలిచి ఆర్థిక మంత్రిగానే కాకుండా వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు కూడా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం ఎవరు అయినా.. అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు గర్నవర్ గా కూడా పని చేశారు రోశయ్య.

1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమతం అయ్యి.. ఎన్టీఆర్ సీఎం అవ్వటంతోపాటు ఏకంగా 216 సీట్లు గెలుపొందింది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి అంటే 1995లో.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో కొణిజేటి రోశయ్య ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత రోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ వార్త కనిపించలేదు. తన పీఏ ద్వారా విషయం ఏంటీ అని ఆరా తీశారంట రోశయ్య. సికింద్రాబాద్ జోన్ పేజీలో మాత్రమే వేశారంట అని పీఏ చెప్పారంట.

కొన్ని రోజుల తర్వాత తనకు కనిపించిన ఈనాడు విలేకరి దగ్గర పత్రికలోని వార్తను ప్రస్తావిస్తూ.. నా ప్రెస్ మీట్ వార్తను సికింద్రాబాద్ జోన్ లో వేశారంట.. కనీసం అమీర్ పేట జోన్ లో అయినా వేయండయ్యా.. నేను కూడా చూస్తాను అని కోరారంట. ఈ వార్త రాసిన టైంకి రోశయ్య ఆషామాషీ వ్యక్తి కాదు.. రోశయ్యను ఎదుర్కోకోలేక ఏన్టీఆర్ ఏకంగా మండలిని రద్దు చేశారు. అలాంటి వాయిస్ ఉన్న వ్యక్తి మాట్లాడితే జోన్ కే పరిమితం చేసిందంట ఈనాడు పత్రిక.

ఆ తర్వాత కాలంలో ఈనాడు అధినేత రామోజీరావును ఏదో ఫంక్షన్ లో రోశయ్య కలిశారంట. పత్రికల్లో కాంగ్రెస్ వార్తల ప్రయార్టీ అంశాన్ని ప్రస్తావించారంట రోశయ్య. దానికి రామోజీరావు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. 294 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 26 సీట్లు మాత్రమే.. దాని ప్రకారమే వార్తలు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారంట.

విచిత్రం ఏంటంటే.. వైఎస్ మరణంతో సీఎం అయిన అదే రోశయ్య దగ్గరకు.. ఇదే ఈనాడు పత్రిక వెళ్లిందంట. వార్తను బాగా రాస్తాం.. ప్రయార్టీ ఇస్తాం.. యాడ్స్ ఇవ్వాలని కోరిందంట. రాజకీయాలను వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడని ఈ పెద్దాయన వారు కోరినట్లే చేశారంట.. అప్పట్లో రోశయ్య వార్తను సబ్ జోన్ పేజీకి మాత్రమే పరిమితం చేసినా కూడా రోశయ్య ఎక్కడా తన హోదా, అధికార దర్పాన్ని చూపించకుండా ఎంతో హుందాతనంగా ఈనాడు పత్రికకు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారంట.

అదే ఈనాడు పత్రిక ఇప్పుడు రూటు మార్చింది. కేవలం 23 సీట్లు గెలిచిన టీడీపీ వార్తలను ఫస్ట్ పేజీ బ్యానర్ లో ఇస్తోంది. అంతే కాదు.. అప్పట్లో ఓడిన పార్టీ నేతలు, పార్టీ వార్తలను జోనల్ పేజీలో వేసిన ఈనాడు.. ఇప్పుడు కేవలం 23 సీట్లు గెలిచిన టీడీపీ వార్తలతోపాటు చోటా, మోటా, బచ్చా లీడర్స్ వార్తలను మసాలా అంటించి మరీ ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేయటాన్ని చూసి ఆశ్చర్యం వేస్తుందని.. ఆ పత్రిక విలువలు ఇలా ఉంటాయని ఓ సీనియర్ జర్నలిస్ట్.. ఓ టీవీ డిబేట్ లో చెప్పిన మాటలు ఇవి. ఇక ఆంధ్రజ్యోతి ఇంతకంటే దారుణాలే చేసిందనుకోండి.. రోశయ్య చూపించిన హుందాతనంలో ఒక శాతం ఈ పత్రికలకు లేవు అంటూ చెప్పుకొచ్చారు ఆ సీనియర్ జర్నలిస్ట్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు