హైదరాబాద్ నుంచి ఏపీకి కార్లలో వెళ్లొచ్చా- వెళితే టైమింగ్స్ ఏంటీ.. పాస్ అవసరం ఉందా ?

ap border checkpost issue

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 5వ తేదీ నుంచి అంటే బుధవారం నుంచి ఉదయం పూట కూడా కర్ఫ్యూ విధించింది. ఓ రకంగా ఇది మినీ లాక్ డౌన్. ఏపీ రాష్ట్రం మొత్తం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అంటే కేవలం ఆరు గంటలు మాత్రమే పని చేస్తుంది. మిగతాది అంతా షట్ డౌన్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు సైతం నడవవు. ఎక్కడి బస్సులు అక్కడే ఉంటాయి. ప్రైవేట్ వాహనాలపైనా ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి కార్ల, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఎలాంటి ఆప్షన్ ఉంది అనేది అందరిలో చర్చనీయాంశం అయ్యింది.

హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కార్లలో వచ్చే వారిపై ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చెక్ పోస్టులు లేవు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఎప్పుడైనా ఈజీగా బోర్డర్ దాటేయొచ్చు. కాకపోతే అత్యవసర సర్వీసులతోపాటు ఎందుకు వస్తున్నారు.. ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది స్పష్టం చెప్పాల్సి ఉంటుంది.

హైదరాబాద్ నుంచి మీరు ఏపీ బోర్డర్ దాచేపల్లికి ఉదయం 6 గంటలకు రీచ్ అయ్యారు అనుకోండి.. అక్కడి నుంచి ఆరు గంటల్లో.. మీరు మీ గమ్యస్థానాలకు వెళ్లిపోవాలి. ఒక వేళ ఈ ఆరు గంటల్లో చేరుకోకపోతే దానికి కారణాలు చెబితే వదిలేస్తారు పోలీసులు. ఎలాంటి పాసులు అవసరం లేదు. ప్రజలు ఎవరైనా సరే ఈ టైమింగ్స్ ఫాలో అయ్యి ఏపీ స్టేట్ లోకి ఎంటర్ అయితే బాగుంటుందని సూచిస్తున్నారు అధికారులు, పోలీసులు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నడుస్తాయి కాబట్టి.. హైదరాబాద్, చెనై, బెంగళూరు, ముంబై లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఈ టైమింగ్ లో బోర్డర్ దాటినట్లయితే ఈజీగా ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత అయితే పోలీసుల వెరిఫికేషన్.. పత్రాల పరిశీలన అంటూ టైం వేస్ట్ కావొచ్చు..

మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీరు ఏపీ బోర్డర్ లోకి ఎంటర్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కాకపోతే అత్యవసరానికి సంబంధించి రీజన్ చెప్పాలి.. రోడ్లు అన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి.. ఎక్కడికక్కడ గ్రామాలు, పట్టణాల్లో చెక్ పోస్టులు పెట్టి ఉంటారు కాబట్టి.. ప్రతిచోటా పోలీసులు ఆపటం, అడగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అత్యవసరం అయితే ఓకే కానీ.. లేకపోతే కార్లలో బయలుదేరే వారు.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇళ్లకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి.

హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేవాళ్లకు ఈ ఆరు గంటల సమయం సరిపోదు కాబట్టి.. ఆయా వాహనదారులు రీజన్ చెబితే వదిలేస్తారు.. డోంట్ వర్రీ.. పాస్ గట్రా ఏమీ అవసరం లేదు. బోర్డర్ దగ్గర ఎలాంటి చెక్ పోస్టులు ఏమీ లేవు.. జస్ట్ వెరిఫికేషన్ మాత్రం ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు