నష్టాలొస్తున్న విశాఖ ఉక్కు వద్దు – లాభాల్లోని తిరుమల ఆలయం కావాలా బీజేపీ?

నష్టాలొస్తున్న విశాఖ ఉక్కు వద్దు - లాభాల్లోని తిరుమల ఆలయం కావాలా బీజేపీ?

Tirumala god vs vizag steel plznt

నష్టాలొస్తున్న విశాఖ ఉక్కు వద్దు – లాభాల్లోని తిరుమల ఆలయం కావాలా బీజేపీ?

తిరుమల పుణ్యక్షేత్రం అనగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకొస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ఆలయం. ప్రస్తుతం స్వతంత్ర ప్రతిపత్తిగా కొనసాగుతుంది. ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక రక్షణ వ్యవస్థ, పాలక మండలితో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉంది తిరుమల పుణ్యక్షేత్రం.

ఆదాయం దండిగా వస్తున్న తిరుమలను కేంద్రం తన పరిధిలోకి తీసుకోబోతున్నదా అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా రక్షిత కట్టడాల రక్షణను పురావస్తు శాఖ పరిధిలోకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల ఆలయం, తిరుపతిలోని పలు పుణ్యక్షేత్రాలను రక్షిత కట్టడాల కింద గుర్తించింది కేంద్రం. అంటే తిరుమల అనేది కేంద్రం పరిధిలోకి వెళుతుండటానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.

2018లోనే దీనికి సంబంధించి అప్పటి మోడీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి లేఖ రాసింది. తిరుమలలో ఉన్న ఆలయాలన్నింటినీ ఫొటోలు తీయటానికి పురావస్తు శాఖకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో లేఖ రాశాంతం. కేంద్రం లేఖపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం ఆదేశాలను.. తిరుమల తిరుపతి పాలక మండలికి పంపించింది. ఆ తర్వాత కేంద్ర పురావస్తు శాఖ పర్యటన జరిగిపోయింది. ఆ సమయంలోనే తిరుమల అభరణాలు, ఆదాయం, ఆస్తులపై దేశానికి చెందిన కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇవన్నీ జరిగితే తిరుమల రాష్ట్ర పరిధి నుంచి కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. రాష్ట్రంతో సంబంధం ఉండదు.

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నష్టాల్లో ఉందన్న సాకుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్ముతున్నారు.. బాగా ఆదాయంతోపాటు భారీ ఆస్తులు ఉన్న తిరుమల మాత్రం కావాలా.. ఆంధ్రరాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వైఖరి ఏంటీ ఇలా ఉంది అనే చర్చ జరుగుతుంది. 20 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు మాత్రం వదలించుకుంటారంట.. లక్షల కోట్ల ఆస్తులు ఉన్న తిరుమల మాత్రం భద్రత పేరుతో కేంద్రం పరిధిలోకి తీసుకుంటారంట.. తిరుపతి పట్టణంతోపాటు.. లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాల్లో ఇదే టాక్ నడుస్తుంది.

ఈ విషయంపై బీజేపీ మౌనంగానే ఉంది. తిరుమలను కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లమని.. ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం చేయమని చెప్పటం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం అమ్మేస్తామని ధీమాగా చెబుతోంది. ఎన్నికలు కాబట్టి తిరుమల విషయంలో మౌనంగా ఉంటుందా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత విశాఖ ఉక్కు విషయంలో మాదిరిగానే కేంద్రం పరిధిలోకి తిరుమలను తీసుకెళ్లటానికి కేంద్రం పావులు కదిపితే.. ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు