తిరుపతిలో ఏజెంట్ల కంటే ఎక్కువ హడావిడి చేసిన ఎల్లో మీడియా

tirupati voting media over fake votes

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శనివారం అంటే ఏప్రిల్ 17వ తేదీ జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటలపాటు పోలింగ్ నిర్వహించారు అధికారులు. కరోనా, ఎండాకాలం దృష్ట్యా సమయాన్ని పొడిగించింది ఎన్నికల సంఘం. ఇదంతా రొటీన్ అయినా.. పోలింగ్ ప్రారంభం కంటే ముందు నుంచే తిరుపతి పట్టణంలో టీడీపీతోపాటు ఎల్లో మీడియా చేసిన హడావిడి ఆశ్చర్యంతోపాటు అవాక్కయ్యేలా చేసింది.

తిరుపతి పట్టణం అంటే మహా పుణ్యక్షేత్రం. తిరుమల వెళ్లే ఏ భక్తుడు అయినా తిరుపతి పట్టణం నుంచే వెళ్లాలి. దీన్ని అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడియా.. తిరుపతి పట్టణంలోకి వచ్చే వాహనాలపై పడింది. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎందుకు వస్తున్నారు.. ఎవరు తీసుకొస్తున్నారు.. మీ పేరేంటీ.. మీ ఊరేంటీ అంటూ పోలీస్ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. పోలీసులు, భద్రతా సిబ్బంది అడాల్సిన ప్రశ్నలు అన్నీ ఎల్లో మీడియానే గొట్టాల పెట్టి అడుగుతుండటంతో భయాందోళనలకు గురయ్యారు భక్తులు, ప్రజలు.

ఇక పోలింగ్ బూతుల దగ్గర అయితే ఏజెంట్ల కంటే ఎల్లో మీడియా హడావిడి ఎక్కువగా కనిపించింది. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన ఓటర్లు పోలింగ్ బూతుల్లో ఉన్నారు. ఒక్క దొంగ ఓటు పడినా.. పరాయి వ్యక్తి వచ్చినా పోలింగ్ బూతులోని ఏజెంట్లు అభ్యంతరం చెప్పరా.. అడ్డుకోరా ఏంటీ.. అలా కాకుండా నీ ఊరేంటీ.. నీ పేరేంటీ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తిరుపతి లోక్ సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటే.. కేవలం తిరుపతి పట్టణంపైనే ఫోకస్ పెట్టటం వెనక ఉద్దేశం ఏంటీ.. మిగతా నియోజకవర్గాలు, గ్రామాల్లో మంచి ఓట్లు పడుతున్నాయా.. గ్రామ స్థాయికి వెళ్లి ఇలాంటి ప్రశ్నలు, హడావిడి ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది.

నీ ఇంటి నెంబర్ ఎంతా అంటూ ఓ ఎల్లో మీడియా ప్రశ్నించింది. ఎవరికైనా ఇంటి నెంబర్లు గుర్తుంటాయా.. A/BA/24/54/C5.. ఇలా ఉంటాయ్ ఇంటి నెంబర్లు.. మనలో ఎంత మందికి ఇంటి నెంబర్లు గుర్తుంటాయి అంటూ ఓటర్లు రివర్స్ ఎటాక్ చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఫంక్షన్ హాలులో దొంగ ఓటర్లు ఉన్నారని.. వైసీపీ చెందిన హోటళ్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారంటూ తెర రాద్దాంతం చేసింది ఎల్లో మీడియా. వాళ్లు అక్కడికి ఎందుకు వచ్చారో.. ఎందుకు ఉన్నారో వాళ్ల సొంత విషయం.. ఏదైనా అభ్యంతరం ఉంటే పోలీసులు చూసుకుంటారు.. ఎన్నికల సంఘం అధికారులు చూసుకుంటారు.. వాళ్లు పోలింగ్ బూత్ దగ్గరకు వస్తే ఏజెంట్లు అడ్డుకుంటారు.. అసలు ఎల్లో మీడియాకు ఎందుకు.. వాళ్లకు వచ్చిన అభ్యంతరం ఏంటీ…

కేవలం తిరుపతి పట్టణాన్ని మాత్రం టార్గెట్ చేసి పోలింగ్ ఏజెంట్ల కంటే.. ఎల్లో మీడియానే హడావిడి ఎక్కువ చేస్తుందంటూ తిరుపతి పట్టణ ప్రజలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగం, పనుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉండకూడదా.. ఓటు వేయటానికి తిరుపతికి రాకూడదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. లోక్ సభ నియోజకవర్గంలోని ఇతర నియోజకవర్గాల్లో.. గ్రామాల్లో ఎక్కడైనా ఇలా జరిగిందా.. ఇంత హడావిడి ఎందుకు చేయలేదు ఎల్లో మీడియా అంటున్నారు ప్రజలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు