తిరుపతిలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

కామందుల్లా కళ్ళు మూసుకుపోతున్నాయి. చిన్నారులను కూడా వదలడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక చోట ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిర్ములించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తెస్తున్నాయి, అయినా నేరాలు తగ్గడం లేదు. కాగా ఆదివారం తిరుపతిలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపింది.

జాన్ అనే ఆటో డ్రైవర్ ఆరుబయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలోనే బాలిక గట్టిగ అరిచింది. బాలిక అరుపులు విన్న స్థానికులు పరుగుపరుగున అక్కడికి వెళ్లారు. స్థానికులు రావడాన్ని గమనించిన జాన్ అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు పట్టుకోని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు