తిరుపతి ఉప ఎన్నికతో తేలిపోనున్న పార్టీల అసలు బలాబలాలు

ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాలి వీచింది అంటున్నారు.. ఆ గాలి 18 నెలలకు పోయింది అని టీడీపీనే అంటోంది.. అంటే తిరుపతి లోక్ సభలో టీడీపీకి...

tirupati lok sabha by election
tirupati lok sabha by election

తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక రాబోతుండటంతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల హడావిడి మొదలైంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు అయ్యారు. పాదయాత్రలో తన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తికి అవకాశమివ్వాలని డిసైడ్ అయ్యారు. కొత్త ప్రయోగంతో ముందుకు వెళుతున్నారు జగన్. దీనికి కారణం లేకపోలేదు.

బీజేపీ – జనసేన పొత్తుతో బరిలోకి దిగుతుంటే.. టీడీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎటూ ఉంటోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ప్రత్యర్థులుగా నాలుగు పార్టీలు, మూడు కూటములు. అధికార పార్టీ వ్యతిరేక ఓటును నాలుగు పార్టీలు పంచుకోవాలి.. దీని లెక్కన ఓట్ల చీలిక భారీగా ఉంటుంది.

సిట్టింగ్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ ది.. అధికారంలో ఉంది.. ధీమాగా ఉంది.. ప్రజా వ్యతిరేక ఉంది అంటున్న టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఆ ఓట్లలను చీల్చుకోవాలి. అప్పుడు మెజార్టీ ఎవరికి ఉంటుంది.. 10 వ్యతిరేకత ఓట్లను నాలుగు పార్టీలు పంచుకుంటే ఏమౌతోంది.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా..

నష్టం ఎక్కువగా ఉండేది టీడీపీకే అంటున్నారు. నాలుగు, ఐదు శాతం ఓట్లు ఉన్న జనసేన పార్టీ బీజేపీతో కలుస్తుండటంతో బీజేపీకి ప్లస్ అయితే.. టీడీపీకి నష్టం అంటున్నారు. కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో తెర వెనక నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందనే అపోహల క్రమంలో.. బీజేపీకి ఓట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు అంతిమంగా టీడీపీకే నష్టం అంటోంది అధికార పార్టీ.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ద్వారా టీడీపీ అసలు సిసలు ఓటు బ్యాంక్ ఏంటో తెలిసిపోతుందని.. ప్రజాదరణ ఆ పార్టీ ఎంత ఉందో స్పష్టం అవుతుంది. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాలి వీచింది అంటున్నారు.. ఆ గాలి 18 నెలలకు పోయింది అని టీడీపీనే అంటోంది.. అంటే తిరుపతి లోక్ సభలో టీడీపీకి వచ్చే ఓట్లే ఆ పార్టీకి ఉన్న బలం ఎంతో చెప్పనున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు