ఏపీలో ఉప ఎన్నిక హీట్ – తిరుపతి టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

ఏపీలో మళ్లీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. ఇటీవలే కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ చనిపోయారు. ఆ స్థానానికి త్వరలోనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మరో నెల రోజుల్లోనే నోటిఫికేషన్ రావొచ్చు అని భావిస్తున్నారు. అధికార పార్టీ కంటే ముందుగానే.. టీడీపీ అభ్యర్థిని ప్రకటించి షాక్ ఇచ్చారు చంద్రబాబునాయుడు.

తిరుపతి పార్లమెంట్ కు టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేయనున్నట్లు అదికారికంగా ప్రకటించారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నేత. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎపీ అభ్యర్థి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారు కాబట్టి.. సానుభూతి ఉంటుందని భావించి ప్రతిపక్షాలు పెద్దగా దృష్టిపెట్టవు. దీన్ని కాదని ఈసారి టీడీపీ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిని టీడీపీ ప్రకటించటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. వైసీపీ ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ కూడా బరిలోకి దిగనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు