నాగార్జునసాగర్ లో పవన్ మద్దతు ఎవరికి?

pawan kalyan support in nagarjuna sagar

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కు జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ ఆసక్తికరంగా ఉంది. టీఆర్ఎస్ – కాంగ్రెస్ – బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. ఏ పార్టీ గెలిచినా.. స్వల్ప ఆధిక్యంతో బయటపడతారనే టాక్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో.. నియోజకవర్గంలో 2, 3 వేల ఓట్లతో గెలుపును డిసైడ్ చేయగల జనసేన పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

బీజేపీ – జనసేన పొత్తు ఉన్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా అడ్డం తిరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ రోజు మధ్యాహ్నం.. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చి.. అందరికీ షాక్ ఇచ్చారు. ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని.. మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని పోలింగ్ రోజు పిలుపునివ్వటం బీజేపీని షాక్ కు గురి చేసింది. ఈ అంశంపై బీజేపీ – జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్మాత దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేతలు.

ఇదే సమయంలో ఏపీలో తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాబోయే సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్.. పువ్వులా చూసుకోమని ప్రధాని మోడీ చెప్పారంటూ వీర్రాజు బాంబ్ పేల్చారు. మరి ఇలాంటి సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పవన్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ బాగా ఎత్తుతున్న సమయంలో.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తారా లేక బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి.. అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకే మద్దతిస్తారా అనే చర్చ జరుగుతుంది.

సాగర్ ఎన్నికల్లో జనసేన పార్టీ న్యూట్రల్ గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు విషయంపై ఎలాంటి ప్రకటన చేయకుండానే.. మిన్నకుండిపోతుందా ఏంటీ అని సస్పెన్స్ గా మారింది. సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుండగా.. ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారిన క్రమంలో.. ఏ పార్టీ గురించి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని జనసేనాని డిసైడ్ అయ్యారంట. తెలంగాణ బీజేపీ ఏమైనా మాట్లాడితే.. ఏపీలోని తిరుపతి కీలకం కదా అన్న పాయింట్ తో తప్పించుకోవచ్చని చూస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు