టాలీవుడ్ హీరోలకు రేవంత్ రెడ్డి షాక్ – నివేదిక కోరిన హైకోర్టు

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన డ్రగ్స్ కేసుపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైంది.. దర్యాప్తు ఏం తేల్చిందో చెప్పాలంటూ 2017లో ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ సరఫరాలో, వినియోగంలో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున.. ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని పిటీషన్ లో వివరించారు.

సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అప్పగించాలని కోరారు. దర్యాప్తునకు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధంగా ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు న్యాయవాది రచన రెడ్డి. సిట్ దర్యాప్తు వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు.. సిట్ దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది.. ఏ స్థితిలో ఉందో డిసెంబర్ 10వ తేదీలోగా కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టులో విచారణ
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఉందని రేవంత్ రెడ్డి పిటీషన్
ప్రభుత్వం వివరాలు ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపిన రేవంత్ రెడ్డి
డిసెంబర్ 10వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు