13 రోజుల్లోనే ఇలా ఉంటే.. నెల రోజుల టైం ఇస్తే పరిస్థితి ఏంటీ

13 రోజుల్లోనే ఇలా ఉంటే.. నెల రోజుల టైం ఇస్తే పరిస్థితి ఏంటీ.. ప్రత్యర్థి పార్టీలకు టైం ఇవ్వలేదు.. వాళ్లకు సరైన అభ్యర్థులు కూడా దొరకలేదు అని భావించింది కానీ..

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతో హడావిడిగా.. చాలా చాలా వేగంగా జరిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 13 రోజుల్లోనే షెడ్యూల్ పూర్తయ్యింది. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత.. టైం ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. అత్యంత వేగంగా ఎన్నికల షెడ్యూల్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ.

13 రోజుల గ్యాప్ లోనే బీజేపీ పార్టీ 49 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో వీరికి ఉన్న బలం 4 మాత్రమే. ఇప్పుడు ఏకంగా 45 సీట్లు.. 35 శాతంపైనే ఓట్లు సాధించింది. రెండు వారాల్లోనే ఇంత సాధించింది అంటే.. నెల రోజుల టైం ఇచ్చి ఉంటే.. బీజేపీ ఏకంగా మేయర్ పీఠం దక్కించుకునేది కదా..

దుబ్బాక ఓటమి తర్వాత ప్రజావ్యతిరేకతను బాగా గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ.. ఎంతో చాకచక్యంగా.. వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది. ట్వింటీ 20 తరహాలో షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లిపోయింది. సిట్టింగ్ కార్పొరేటర్లు ఉండటాన్ని అనుకూలంగా మార్చుకుని.. ప్రత్యర్థులకు టైం లేకుండా చేసింది.

టీఆర్ఎస్ పార్టీ ఒకటి తలిస్తే.. ఓటర్లు మరోలా ఆలోచించారు అని రిజల్ట్స్ చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు టైం ఇవ్వలేదు.. వాళ్లకు సరైన అభ్యర్థులు కూడా దొరకలేదు అని భావించింది కానీ.. ప్రజా వ్యతిరేకతలో అభ్యర్థులను పట్టించుకోరు.. పార్టీనే చూసి వేస్తారు అనే బేసిక్ పాయింట్ మర్చిపోయింది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ వీస్తున్నది పార్టీ వ్యతిరేక గాలి అన్న సంగతిని గుర్తించలేకపోయింది.

ఓ రకంగా టీఆర్ఎస్ పార్టీకి మంచే జరిగింది అనే పాయింట్ కూడా ఉంది. 13 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ చేయటం వల్ల 56 స్థానాలు గెలిచింది.. అదే నెల రోజుల టైం ఇచ్చి ఉంటే ఈ 56 కూడా వచ్చేయి కాదు అనే టాక్ ఇప్పుడు జనంలో బాగా వినిపిస్తుంది.

13 రోజుల్లోనే టీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే.. నెల రోజుల షెడ్యూల్ ఇచ్చి ఉంటే ఇంకెలా ఉండేదో టీఆర్ఎస్ పరిస్థితి అనే పాయింట్ పై హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి జనంలో..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు